బొద్దుగా తయారవుతున్న తమన్నా

  • May 21, 2016 / 01:53 PM IST

బాహుబలిలో కలల సుందరి అవంతికగా అలరించిన తమన్నాబొద్దుగా మారుతోంది. విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ హారర్ కామెడీ చిత్రం ‘అభినేత్రి’ లో తమన్నానటిస్తోంది. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభుదేవా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.

తొలిసారి తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రాజమండ్రి, ముంబై, వైజాక్ లో జరిగింది. కీలక సన్నివేషాల్లో తమన్నాబొద్దుగా ఉంటే బాగుంటుందని డైరక్టర్ చెప్పడంతో మిల్కీ బ్యూటీ బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తోంది. తమన్నా తొందరగా బరువు పెరిగితే జూన్ లో చిత్రాన్ని పూర్తి చేసి జూలై లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus