టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున, అందాల భామ తమన్న, తమిళ్ యువ హీరో కార్తి కలసి చేసిన తొలి ప్రయత్నం ‘ఊపిరి’ వీరి ముగ్గురు కాంబినేషన్ అంటేనే సరికొత్త ఆకర్షనకు వేదికయ్యింది ఈ ఊపిరి సినిమా. అయితే శుక్రవారం అనేక అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా అనుకున్న దానికన్నా భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుని రికార్డు దిశగా దూసుకుపోతుంది. టాలీవుడ్ లో టాప్ సినిమాలకు సైతం తక్కువ రేటింగ్స్ ఇచ్చే క్రిటికల్ విమర్శకులు ఉన్నారు. అలాంటి క్రిటికల్ మనసు ఉన్న విమర్శకులు కూడా ఈ సినిమా చూసి ఎగ్సైట్మెంట్ తో 3.25 నుంచి దాదాపుగా 3.75 రేటింగ్స్ ఇచ్చేశారు. అయితే ఇక్కడ అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రంకు అక్కడ మాత్రం ఎదురు దెబ్బ తగిలింది…
అక్కడ అంటే ఎక్కడా అనేగా మీ ఉద్దేశం అయితే ఈ మ్యాటర్ జాగ్రత్తగా చదవండి. తమిళ హీరో కార్తి ప్రత్యక పాత్రలో ఆకర్షించగా, ఈ సినిమాను తమిళ్ లో సైతం విడుదల చేశారు.. తమిళ్ లో ‘తోళా’ అన్న పేరుతో విడుదలయిన ఈ సినిమా అనుకున్నంత భారీ విజయాన్ని నమోదు చేసుకోకపోవడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు సినిమా యూనిట్. రేటింగ్స్ విషయంలో దాదాపు 3.75వరకు తెలుగు వస్తే..తమిళ తంబీలు మాత్రం 3 స్టార్లు ఇచ్చారు.
ఇక అక్కడి క్రిటిక్స్ అయితే మరీ విడ్డూరంగా 2.75 స్టార్స్ ఇవ్వడం విశేషం. మరి తెలుగు ప్రేక్షకుల మనసుకు హత్తుకున్న ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను కదిలించలేకపోయిందో…లేకపోతే తెలుగు వర్షన్ కంటే కూడా 20 నిమిషాలు లెంగ్త్ ఎక్కువగా ఉండడం, అంటే తెలుగులో 2 గంటల 40 నిమిషాలైతే.. అక్కడ దాదాపు 3 గంటల సినిమా చూపించడంతో తేడా వచ్చిందో కానీ తమిళ ఊపిరి మాత్రం కాస్త యావరేజ్ టాక్ తెచ్చుకుంది.