సంచలనాలు సృష్టిస్తున్న తనుశ్రీదత్తా!

“ఆషిక్ బనాయా అప్నే” అనే పాట, సదరు పాట వీడియో తెలియని కుర్రాడు మాత్రమే కాదు మధ్య వయస్కుడు కూడా ఉండదు. ఆ పాట, ఆ పాటలో తనుశ్రీ న్యూడ్ బ్యాక్ చేసిన రచ్చ అలాంటిది. అలా బాలీవుడ్ లో సూపర్ సెక్సీ ఇమేజ్ సొంతం చేసుకొన్న తర్వాత తెలుగులో బాలకృష్ణ సరసన “వీరభద్ర” సినిమాలో నటించి అందాల ఆరబోతతో తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లను వేడెక్కించిన తనుశ్రీదత్తా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. అయితే.. ఉన్నట్లుంది తనుశ్రీదత్తా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. “హార్న్ ఒకే ప్లీజ్” అనే సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు నానా పటేకర్ తన చెయ్యి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీదత్తా పేర్కొన్న విషయం తెలిసిందే.

ఆ విషయమై నానా పటేకర్ స్పందించడం, పటేకర్ కి గణేష్ మాస్టర్ కూడా తోడుగా నిలిచి “తనుశ్రీ తప్పుగా అర్ధం చేసుకొంది” అని సపోర్ట్ చేయడంతో వెంటనే స్పందించిన తనుశ్రీ దత్తా ఇద్దరూ కలిసి తనను బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ రెస్పాండ్ అయ్యింది. అయితే.. ఇప్పుడు తనుశ్రీ దత్తా ఇంకో సంచలనమైన కామెంట్ చేసింది. తనను సదరు చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి “సెట్ లో అందరి ముందు బట్టలు విప్పి డ్యాన్స్ చేయమన్నాడు” అని తనుశ్రీదత్తా ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రస్తుతం వైరల్ అయ్యింది. తనుశ్రీదత్తాకు బాలీవుడ్ నటీమణులు చాలామంది మద్దతు ప్రకటించడంతో తనుశ్రీదత్తా స్టేట్ మెంట్స్ కి వేల్యూ పెరుగుతుంది. మరి ఈ రచ్చ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus