సిట్ విచారణలో ఉద్వేగానికి గురైన తరుణ్!

  • July 24, 2017 / 06:15 AM IST

టాలీవుడ్ లో యువ హీరోగా సూపర్ డూపర్ హిట్ అనుకున్న తరుణ ఆ తరువాత కాలక్రమేణా మిగిలిన హీరోల హడావిడి ఎక్కువ కావడంతో తెరమరుగు అయిపోయాడు…అప్పుడప్పుడు అర కొరా అంటూ సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఏదో సో సో గా హిట్ అన్న పదానికి దూరంగా బ్రటికేస్తూ ఉన్నాడు ఈ గత యువ హీరో…ఈదిల్ ఉంటే అప్పట్లో హీరోగా అలరించిన తరుణ ని ఇలా డ్రగ్స్ కేసులో విచారణకు పిలుస్తారు అని ఎవ్వరూ ఊహించలేదు…ఇక నిన్న సిట్ నోటీసుల ఆధారంగా సిట్ ముందు హాజరయిన తరుణ్ అనేక విషయాలు బయట పెట్టినట్లు అంతేకాకుండా…కాస్త ఉద్వేగానికి కూడా లోనయినట్లు సమాచారం…అసలు తరుణ్ విచారణ వివరాల్లోకి వెళితే…తాను డ్రగ్స్ వాడనని తనకు ఇందులో ఏమాత్రం ప్రమేయం లేదని చాలాకాలంగా తాను సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నానని తరుణ్‌  చెప్పాడని టాక్. అయితే దానికి కౌంటర్ గా తమ వద్ద తరుణ్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు వాట్సాప్ వివరాలు ఆధారంగా సిట్ చూపించడంతో తరుణ్ షాక్ అయినట్లు టాక్. ఇక దానికి సమాధానంగా దీనితో పొరపాటున గతంలో ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నానేమో కానీ ఇప్పుడయితే అలవాటు లేదని తరుణ్ చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

ఇక ఇదే సంధర్భంలో తరుణ్ మాట్లాడుతూ తానూ ఆర్థికంగా బలహీనంగా ఉన్నానని మనసు మనసులో లేదని ఉద్వేగానికి గురి అయినట్లు టాక్. గతంలో తరుణ్ పబ్బు మూసివేయడానికి గల కారణాలు గురించి సిట్ అధికారులు ఆరా తీసినట్లు టాక్. ఇక కెల్విన్ తో సంభంధాలపై కూడా తరుణ్ కాస్త తడబడుతూ సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది…మీరు నడిపిన పబ్ లో డ్రగ్స్ అమ్మెవారా అంటే…? డ్రగ్స్ తన పబ్బులోనే కాదని చాలా పబ్బుల్లో కనిపిస్తుందని చెబుతూ కొన్ని పబ్బుల గురించి  వివరాలు చెప్పాడని  తెలుస్తోంది. మొత్తంగా చూస్తే…ఈ విచారణలో తరుణ్ నుంచి కీలక సమాచారం లాగినట్లుగా తెలుస్తుంది. మరి ఈ సమాచారం వల్ల సిట్ టీమ్ ఇంకెంత మందిని ఈ కేస్ లో భాదితులను చేస్తుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus