‘టాక్సీవాలా’ క్లోజింగ్ కలెక్షన్స్

  • December 19, 2018 / 07:52 AM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘టాక్సీవాలా’. ‘జి.ఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై రాహుల్ సంక్రిత్యాన్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టి మరోసారి విజయ్ దేవరకొండ స్టామినా ఏంటనేది ప్రూఫ్ చేసింది. నిజానికి రిలీజ్ కు ముందే ఈ చిత్రం పైరసీ బారిన పడటంతో ఈ చిత్రం పై పెద్దగా అంచనాలేమి లేవు. అయితే పైరసీ ప్రభావం ఈ చిత్రం పై ఏమాత్రం పడకపోవడం విశేషం.

‘టాక్సీవాలా’ చిత్రం ఫుల్ రన్లో దాదాపు 21.28 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ‘గీత గోవిందం’ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాల రేంజ్ కలెక్షన్లు రాబట్టలేనప్పటికీ.. కొన్న డిస్ట్రిబ్యూటర్లందరికీ లాభాల పంట పండింది. ఈ చిత్రం ఒక్క నైజాం ఏరియాలోనే దాదాపు 7.70 కోట్ల షేర్ ను రాబట్టగా .. ఓవర్సీస్ లో 3 కోట్ల వరకు షేర్ వరకు రాబట్టింది. రజనీ- శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘2.0’ చిత్రం ఇంకొంచెం లేటుగా వచ్చినట్లయితే ఈ చిత్రం కలెక్షన్లు ‘అర్జున్ రెడ్డి’ కలెక్షన్లను కూడా దాటేసేవి అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus