AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

ఓ వైరల్ సాంగ్‌తో ‘అల్లు అర్జున్‌ – లోకేశ్ కనగరాజ్‌’ సినిమాను అనౌన్స్‌ చేసింది టీమ్‌. ఆ పాట ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఉంది. దాంతోపాటు మరో విషయం కూడా వైరల్‌ అవుతోంది. అదే టీమ్‌ చెప్పినట్లుగా ఈ సినిమా ఈ ఏడాదే ప్రారంభం అవుతుందని. ప్రస్తుతం బన్నీ చేస్తున్న సినిమా, ఆయన ఇంట్లో జరుగుతున్న పెళ్లి సంబరాలు చూసి ఇప్పట్లో లోకేశ్‌ సినిమా ప్రారంభం కాకపోవచ్చు అని ఓ అంచనా వేసేస్తున్నారు సినీ గోయర్స్‌. మరి ఈ మాటలు సినిమా టీమ్‌ వరకు వెళ్లాయో ఏమో క్లారిటీ ఇచ్చారు.

AA23

బన్నీ – లోకేశ్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది ద్వితీయార్ధం ప్రారంభంలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తామని మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. అంతేకాదు ఈ ఏడాది ఆఖరులోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ఉద్దేశంలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంటే ఈ సినిమాను కూడా వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని టీమ్‌ చూస్తోందని అర్థమవుతోంది. ఒకవేళ అప్పుడు రాకపోతే సమ్మర్‌లో రిలీజ్‌ చేసే అవకాశం ఉంది.

మరి అనుకున్నట్లుగా సినిమా మొదలవుతుందా? మొదలైతే పూర్తవుతుందా? పూర్తయితే వస్తుందా? అనేది చూడాలి. అయితే ఇదంతా ప్రస్తుతం అల్లు అర్జున్‌ చేస్తున్న అట్లీ సినిమా మీద ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాను ఎంత వేగంగా వేగంగా పూర్తి చేద్దామనుకున్నా ఆ సినిమా నేపథ్యం ప్రకారం చూస్తే ఇంత త్వరగా షూటింగ్‌ అయ్యేలా కనిపించడం లేదు. అదే జరిగితే లోకేశ్‌ సినిమా కూడా లేటవుతుంది. కానీ టీమేమో మేం ఈ ఏడాదే ప్రారంభిస్తాం, ఈ ఏడాదే పూర్తి చేస్తాం అని చెబుతున్నారు.

ఇక అట్లీ సినిమా గురించి చూస్తే.. ఇది సూపర్‌ హీరో స్టయిల్‌ సినిమానే అయినప్పటికీ ఇందులోనూ తనదైన శైలిలో కామెడీ ట్రాక్‌ను కూడా పెట్టాలని అట్లీ ప్లాన్‌ చేశారట. ఆయన గత సినిమాలోనూ ఈ స్టైల్‌ చూశాం. మరిప్పుడు ఎలాంటి సీన్స్‌ రాశారో చూడాలి.

 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus