ప్రెజంట్ ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ అండ్ రిజర్వేషన్ బట్టి ఒక దర్శకుడికి ఒక స్టార్ హీరో దొరకడమే కాదు, ఆ స్టార్ హీరోను ఒప్పించి అతడితో సినిమా చేయడమే గగనమైపోతున్న ఈరోజుల్లో ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోస్ కి కథ చెప్పి ఒకే చేయించడంతోపాటు ఆ రెండు ప్రొజెక్ట్స్ ను ఒకేసారి డైరెక్ట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు తేజ. “నేనే రాజు నేనే మంత్రి”కి ముందు వరుస ఫ్లాప్స్ లో ఉన్న తేజను పట్టించుకొన్న పెద్ద హీరో ఒక్కడూ లేడు. అలాంటిది ఒకేసారి బాలకృష్ణ, వెంకటేష్ లు ఒకరితర్వాత ఒకరు తేజ చెప్పిన కథను ఒప్పుకొని నటించడానికి ఒకే చెప్పడంతోపాటు తమ సొంత బ్యానర్లలో సినిమాలు చేయడానికి సన్నాహాలు సైతం చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో “ఎన్టీయార్” బయోపిక్ ను తీయనున్న తేజ.. ఆ సినిమాతోపాటే వెంకటేష్ కథానాయకుడిగా “సుందరాకాండ” తరహా చిత్రాన్ని తీయనున్నాడని సమాచారం. ఈ రెండు ప్రొజెక్ట్స్ ను ఇంచుమించుగా ఒకేమారు మొదలెట్టానున్నాడట తేజ. ఆల్రెడీ “ఎన్టీయార్ బయోపిక్” ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టిన తేజ.. వెంకటేష్ తో తీయబోయే చిత్రానికి కథ రెడీ చేసుకొని ప్రీప్రొడక్షన్ పనులు ఈనెలలో మొదలెట్టానున్నాడు. ఒకే ఒక్క సూపర్ హిట్ అనంతరం తేజకు ఇలా ఆఫర్లు వెల్లువెత్తడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.