అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నేను’, అలాగే సిద్దార్థ్ త్రిష జంటగా వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ఎన్టీఆర్ ‘యమదొంగ’, మహేష్ బాబు ‘ఖలేజా’ వంటి చిత్రాలలో నటించిన అర్చన.. అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’ సినిమాతో హీరోయిన్ గా ట్రై చేసినా ఆ చిత్రం హిట్ కాకపోవడంతో సైడ్ క్యారెక్టర్లకే పరిమితమైంది. ఇక అటుతరువాత ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో కంటెస్టెంట్ గా వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అయితే ఆ క్రేజ్.. సినిమా అవకాశాలకు మాత్రం ఉపయోగపడలేదు. ఇక అర్చన త్వరలో పెళ్ళి కూతురు కాబోతుంది. ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు జగదీష్ తో ఈమె నిశ్చితార్థం.. ఇటీవల బంజారాహిల్స్‌లోని హోటల్ ‘రాడిసన్ బ్లూ’లో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకి సినీ ప్రముఖులు సుమంత్, నవ్ దీప్, శివబాలాజీ వంటి వారు హాజరయ్యారు. అయితే అర్చన, జగదీష్ ల పెళ్ళి డేట్ ఎప్పుడనేది ఇంకా అనౌన్స్ చేయలేదు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!