కేవలం తెలుగులో మాత్రమే కాక తమిళ, హిందీ భాషల్లోనూ పదేళ్లకుపైగా.. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం ఉన్న కాజల్ అగర్వాల్ ఇవాళ తెలుగు మీడియాను దాదాపు 2 గంటలు వెయిట్ చేయించి వాళ్ళ కోపానికి కారకురాలు కావడమే కాక తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా మీడియా ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. తాను కథానాయికగా నటించిన తాజా చిత్రం “కవచం” ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ ఉదయం చిత్రబృందం ఉదయం 10 గంటలకు మీడియా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయగా కాజల్ లేట్ గా వచ్చింది. లేట్ అంటే అందరు హీరోహీరోయిన్లు చేసే విధంగా 20, 30 నిమిషాలు లేట్ గా హాజరవ్వడం కాదు.. ఏకంగా రెండు గంటలు లేట్ చేసిందట. దాంతో తెలుగు ప్రింట్ మీడీయా సభ్యులు కోపంతో ప్రెస్ మీట్ ను బోయ్ కాట్ చేసి వెళ్ళిపోయారు.
దాంతో.. ఇప్పుడు కాజల్ లాంటి సీనియర్ హీరోయిన్ కూడా తెలుగు మీడియాకి కనీస స్థాయి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ఈవెంట్స్ కి హాజరవ్వడానికి టైమింగ్ మెయింటైన్ చేసే హీరోయిన్లు ఈ విధంగా మీడియాని చిన్నచూపు చూడడం వాళ్ళ కెరీర్ లకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే.. వాళ్ళ పంక్చువాలిటీ ఇలా ఉండడం మాత్రం గమనార్హం.