‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

  • November 18, 2019 / 05:46 PM IST

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి యల్’. సందీప్ కిషన్,హన్సిక జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఈ చిత్రం మొదటి షోతోనే ప్లాప్ టాక్ మొట్టకట్టుకుంది. రివ్యూలు కూడా చాలా బ్యాడ్ గా వచ్చాయి. కానీ సందీప్ కిషన్ గత చిత్రం బాగానే ఆడింది కాబట్టి.. ప్రమోషన్లు కూడా ఈ చిత్రానికి గట్టిగా చేశారు. దీంతో ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.

ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 0.59 cr
సీడెడ్ 0.17 cr
ఉత్తరాంధ్ర 0.20 cr
ఈస్ట్ 0.14 cr
వెస్ట్ 0.10 cr
కృష్ణా 0.15 cr
గుంటూరు 0.12 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ 1.63 cr(share)

ఈ చిత్రానికి 5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి మూడు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.63 కోట్ల(షేర్) ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే మొదటి రోజు ప్లాప్ టాక్ రావడంతో రెండో రోజు ఓపెనింగ్స్ బాగా తగ్గాయి. కానీ వీకెండ్ కావడంతో పర్వాలేదనిపించే విధంగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక వీక్ డేస్ లో ఈ చిత్రం బాగా కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుంది. లేకపోతే కష్టమే.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus