టాలీవుడ్ లో మోస్ట్ బిజియస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman). ప్రతి సినిమా పాట విడుదలైనప్పుడు లేక సినిమా విడుదలైనప్పుడు ట్యూస్ విషయంలో లేదా బీజియం విషయంలో ఏదో ఒకరకంగా ట్రోల్ అవుతూనే ఉంటాడు. గతేడాది “డాకు మహారాజ్, ఓజీ” సినిమాల విషయంలో మాత్రమే తమన్ సేఫ్ అయ్యాడు. “తెలుసు కదా” బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఇప్పటికీ ట్రోల్ అవుతూనే ఉంటాడు.
అయితే.. నిన్న తాను గురువుగా భావించే కోన వెంకట్ నిర్మిస్తున్న “బ్యాండ్ మేళం” టీజర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు తమన్. ఆ సందర్భంలో హీరో హర్ష్ రోషన్ & హీరోయిన్ శ్రీదేవిలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీ కెమిస్ట్రీ బాగుంది, అది ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి” అని తమన్ అన్న మాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తమన్ (Thaman) లాంటి సీనియర్ టెక్నీషియల్ ఇద్దరు పిల్లల్ని ఉద్దేశించి ఇలా మాట్లాడడం ఏమాత్రం సమాజసం కాదు అని చాలామంది భావించారు. ఇంకొందరైతే ఇంత చీప్ గా మాట్లాడడం ఏంటి అని ప్రశ్నిస్తూ.. ఖండిస్తున్నారు కూడా. అయితే.. ఈ విషయంలో తమన్ వెంటనే “నాకు జువాలజీ అంటే ఏంటో కూడా తెలియదు” అని తమన్ కవర్ చేయడానికి ట్రై చేసైనా ఉపయోగం లేకుండాపోయింది.
మరి ఈ ఇష్యూ ఇంతటితో సమసిపోతుందో లేక.. తమన్ (Thaman) రెస్పాండ్ అయ్యి క్షమాపణ చెప్పేదాకా వస్తుందో చూడాలి. ఎందుకంటే.. తమన్ మీద ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేవు, అతడ్ని ట్యూన్స్ విషయంలో ట్రోల్ చేయడమే తప్ప, పర్సనల్ గా ఎవరూ ఎప్పుడూ ట్రోల్ చేయలేదు. తమన్ సంగీత సారథ్యంలో భవిష్యత్తులో రాబోయే సినిమాల మీద ఈ స్టేట్మెంట్ ఎఫెక్ట్ ఏమేరకు ఉంటుంది అనేది కూడా చూడాలి.
మీ ఇద్దరి కెమిస్ట్రీ ఇలాగే ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి..#BandMelam #HarshRoshan #Sridevi #KonaVenkat pic.twitter.com/QFFdWPa0s0
— Filmy Focus (@FilmyFocus) February 24, 2026