యంగ్ రెబల్ స్టార్ సినిమాలోని బెస్ట్ యాక్షన్ సీన్స్!

సినీ పరిశ్రమకు చెందిన కుటుంబంలోంచి హీరోగా రావడం అంటే తేలికే. కానీ నటుడిగా నిరూపించుకొని, ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకొని స్టార్ గా ఎదగడమంటే ఎంతో కష్టపడాలి. అతి తక్కువ చిత్రాలతోనే యంగ్ రెబల్ స్టార్ స్థాయి నుంచి ఇండియన్ స్టార్ గా కీర్తి పొందడం ప్రభాస్ ఒక్కరికే సాధ్యమైంది. అందుకు అతను పడిన శ్రమ కొన్ని సీన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ సినిమాలోని బెస్ట్ యాక్షన్ సీన్స్ పై ఫోకస్..

వర్షం ప్రభాస్ కి స్టార్ హోదాను తీసుకొచ్చిన చిత్రం వర్షం. ఇందులో ప్రీ క్లైమాక్స్ ఫైట్ లో యంగ్ రెబల్ స్టార్ జీప్ ని పట్టుకుని ఆపే సన్నివేశం యువతలో క్రేజ్ ని పెంచింది.

ఛత్రపతిఛత్రపతి మూవీలో ఇంట్రవెల్ బ్యాంగ్ ఫైట్ చాలా బాగుంటుంది. ఆ ఫైట్ కి ముందు బాబుని రక్షించే సీన్లో కాట్ రాజ్ ని కొట్టే సన్నివేశంలో ప్రభాస్ వంద శాతం రౌద్ర రసాన్ని ప్రదర్శించారు.

యోగిఅమాయకుడుకి కోపం వస్తే ఎలా ఉంటుందో.. యోగి చిత్రంలో ప్రభాస్ చక్కగా చూపించారు. యోగి పాత్రలో మాస్ ప్రేక్షకుడు తనను తాను ఊహించుకుంటాడు. అంతలా డార్లింగ్ నటించారు.

మున్నాసినిమాల్లో వర్షంలో ఫైట్ చాలా చూసి ఉంటాం. అలాగే ప్లే గ్రౌండ్ లో యాక్షన్ సీన్ బోలెడు. ఈ రెండింటిని కలిపి ప్రభాస్ చేస్తే చిన్న సైజ్ సునామీ వస్తుంది. మున్నా సినిమాలో వచ్చే బాస్కెట్ బాల్ ప్లే గ్రౌండ్ యాక్షన్ సీన్లో డార్లింగ్ ఫెరఫార్మెన్స్ ఎక్స్ లెంట్.

బిల్లాకోట్ వేసుకొని హుందాగా నడవడం సులువైన పని, కొట్టడమంటేనే కష్టం. అటువంటి యాక్షన్ సీన్లో ప్రభాస్ అద్భుతంగా ఫైట్స్ చేసి ఔరా అనిపించారు. బిల్లా సినిమాలో ఉన్న ఈ సన్నివేశం డార్లింగ్ అభిమానులు మరిచిపోలేరు.

డార్లింగ్పిచ్చకొట్టుడు.. దంచి కొట్టుడు.. అని ఫైట్లకు ఎన్నో పేర్లు పెడుతాం. కానీ రౌడీలని స్టైల్ గా కొట్టడం ప్రభాస్ కే సాధ్యం. డార్లింగ్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ఐస్ గడ్డల్ని పగలకొట్టే సీన్ అదరహో అనిపిస్తుంది.

రెబెల్రెబల్ మూవీలో ప్రభాస్ రెండు చేతులు వెనక పెట్టుకుని సిగెరెట్ తాగుతూ నడుచుకొస్తున్న ఆ స్టైల్ కి థియేటర్ కేకలతో నిండిపోయింది. ఇంటరెవెల్ కి ముందు వచ్చే ఈ సీన్లో ప్రభాస్ స్టైల్ సూపర్.

మిర్చి మిర్చి లో ఎన్నో అదిరిపోయే సీన్లు ఉన్నాయి. ఒక సీన్లో ప్రభాస్ తన స్టైల్లో వార్నింగ్ ఇవ్వడం అందరికీ భలే నచ్చింది. విలన్ (ఉమ) మనుషులు ప్రభాస్ తండ్రి ఇంటికి వచ్చి బెదిరించి వెళుతుంటే అప్పుడు ప్రభాస్ వెళ్లి ఆ కారుని ఆపి అధికారికి వార్నింగ్ ఇచ్చే సీన్..” 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్దాయన్ని నమ్ముకుని దైర్యంగా ఉన్నాయి. ఆరుగురిని వేసుకొని వచ్చి ఆ ధైర్యాన్నే బయపెడుదామంటే మీరెలా నమ్మర్రా ..” అని కారు అద్దంపై చెయ్యి వేస్తే ఆ కారు అద్దం బీటలు పడే సీన్ సూపర్. “ఇరవై ఏళ్ల నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు”. అని డైలాగ్ చెబుతుంటే విజిల్స్ వేయకుండా ఉండలేరు.

కిరాక్ సీన్మిర్చి సినిమాలో ప్రభాస్ నటన పీక్స్ లో ఉండే మరో సీన్ ఇంట్రెవెల్ ముందు వచ్చే సన్నివేశం. డార్లింగ్ నటనకు తోడు దేవీ శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ సాంగ్ కిరాక్ పుట్టిస్తుంది.

బాహుబలిప్రభాస్ కండబలం చూపించాలంటే కేవలం ఫైట్ అవసరం లేదని నిరూపించిన సీన్ బాహుబలి లో ఉంది. అందులో శివలింగాన్ని మోస్తూ నదిలోకి దూకే ప్రభాస్ ని చూస్తే ఏ అమ్మాయికి అన్నయ్య అని పిలవాలని పించదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus