బిగ్‌బాస్‌ 4: బిగ్ బాస్ స్క్రిప్ట్ ఓవర్..!

బిగ్ బాస్ సీజన్ ఏదైనా సరే లవ్ స్టోరీ అనేది కామన్. హౌస్ లోకి వచ్చిన సెలబ్రిటీలు ఎవరితో ఒకరితో ప్రేమాయణాన్ని కొనసాగించాల్సిందే. అది స్క్రిప్ట్ ఇచ్చి పంపుతారో లేదా అలా ఆటోమేటిక్ గా జరిగిపోతుందో తెలియదు కానీ, చూసే ప్రేక్షకులు మాత్రం వీటిని బాగానే ఎంజాయ్ చేస్తారు. సీజన్ 2 లో సామ్రాట్ తేజస్విని, సీజన్ 3 లో రాహుల్ పునర్నవిల ఎపిసోడ్స్ ఇలా మనం చూసినవే. ఇప్పుడు అభిజిత్ – మోనాల్ – అఖిల్ అంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీని చాలావారాలు రన్ చేశారు. మోర్ ఎంటర్ టైన్మెంట్ మోర్ ఫన్ అంటూనే ఈ లవ్ ఎపిసోడ్స్ ని కూడా మనం ఫీల్ అయ్యేలా చేశారు. మరి ఇది స్క్రిప్ట్ వర్క్ చేసి చేశారా.. లేదా ఇలా జనరల్ గా జరిగిపోయిందా అనేది హౌస్ మేట్స్ కే తెలియాలి.

రెండోవారం నుంచి ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించిన ఈ ఎపిసోడ్ 8వ వారంలో శుభంకార్డ్ పడబోతోందా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. ఈ లవ్ స్టోరీని ఫీల్ అయిన బిగ్ బాస్ లవర్స్ అందరూ అభిజిత్ మోనాల్ ఎప్పుడెప్పుడు కలిసి మాట్లాడుకుంటారా అని వెయిట్ చేస్తున్నారు. నిజంగా వీరిద్దరిని కలపడానికి అఖిల్, సోహైల్, మెహబూబ్ ఇలా పెద్ద టీమ్ వర్కే జరుగుతోంది. అంతకముందు అరియానా కూడా అభిజిత్ మోనాల్ ఇద్దరిని తిరిగి మాట్లాడుకోమని అభిజిత్ తో రిక్వస్ట్ చేసింది. ఈ విషయం అయితే అస్సలు డిస్కస్ చేయద్దు అని చెప్పాడు అభిజిత్. ఆ తర్వాత నోయల్ అండ్ లాస్య ఇద్దరూ కూడా కలిసి ప్రయత్నించారు. అయినా వర్కౌట్ అవ్వలేదు. దివి హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఇది ఫలించలేదు. ఇలా అందరూ ప్రయత్నించిన తర్వాత, ముస్తఫా ముస్తఫా అంటూ పాటేసుకుని మరీ వాటేసుకున్నాడు అఖిల్. ఇప్పుడు అఖిల్ వీరిద్దరిని కలుపుతాడా ? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి బిగ్ బాస్ స్క్రిప్ట్ అనేది ఎక్కడివరకూ ఉందని తెలియట్లేదు. మొదట్లో అరేయ్ అని పిలిచినందుకు, అలాగే ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినందుకు అభిజిత్ ఫీల్ అయ్యాడని ఇన్ని వారాలు అఖిల్ మాట్లాడలేదు. అంతేకాదు, పెద్ద డ్యూడ్ లా కటింగ్ ఇస్తావని నామినేట్ కూడా చేశాడు. మరి అంతలా ద్వేషం పెంచుకున్న అఖిల్ సడెన్ గా ఒక్కరాత్రిలో ఎలా అభిజిత్ ని వెళ్లి హగ్ చేస్కున్నాడు అనేది అడియన్స్ కే తెలియాలి. మరి దీన్ని ఏమంటారు..? బిగ్ బాస్ స్క్రిప్ట్ ఓవర్ (అతి) అంటారా.. ? లేదా ఓవర్ ( అయిపోయింది ) అంటారా..? మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి..!!

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus