పెళ్ళి కాకుండానే తల్లి కాబోతున్న హీరోయిన్..?

సినీ ప్రముఖుల పై కొన్ని రూమర్స్ రావడం సహజం. దాన్ని వారు కూడా అర్ధం చేసుకుని… పెద్దగా పట్టించుకోకుండా వారి పని వారు చూసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిరూమర్లు శృతి మించితే వాటి పై మండిపడుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం..! పలానా ‘సినీ నటీ నటులు లేదా దర్శక నిర్మాతల .. మధ్య ప్రేమ చిగురించింది’ వంటి రూమర్లను సైతం ఈ మధ్య ఎక్కువ పట్టించుకోవట్లేదు సినీప్రముఖులు. అయితే ఇటీవల వచ్చిన ఓ రూమర్ కి… దక్షణాది భామ లక్ష్మీ రాయ్ మండిపడింది.

వివరాల్లోకి వెళితే ఇటీవల లక్ష్మి రాయ్… తాను వ్యాయామం చేస్తూ ఎవరేమన్నా కూడా పట్టించుకోనని ఒక బలైమన అర్ధం వచ్చేలా కొటేషన్ తో ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి ఆమె ప్రెగ్నెంట్ కాబోతుందని ఓ కోలీవుడ్ మీడియా కథనాన్ని అల్లేసి పోస్ట్ చేసింది. ఇక ఈ వార్త తెలుసుకున్న లక్ష్మీ రాయ్ ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. దీనికి లక్ష్మీ రాయ్ స్పందిస్తూ… “వావ్ నిజమా? అర్ధం లేని స్టోరీని అల్లడంలో ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో అర్ధమవుతోంది. కేవలం వ్యూస్ కోసమే ఇలా చేశారు. నన్ను సంప్రదిస్తే బెటర్ స్టోరీ ఇచ్చేదాన్నికదా”… అంటూ లక్ష్మి రాయ్ ఘాటుగా వివరణ ఇచ్చింది. ఇప్పుడు ఈ వార్త ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus