బాలీవుడ్ హాట్ ఐటెం గాళ్స్ రేట్ ఎంత ?

  • June 24, 2016 / 12:54 PM IST

సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉంటే హిట్ గ్యారంటీ అని చాలా మంది దర్శకుల నమ్మకం. అందుకే ఒక్కపాటలో నైనా అందాల ఆరబోతకు అవకాశం ఇస్తుంటారు. ఈ పాటలో నర్తించే భామలకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తో పాటు.. ఎక్కువమంది ఫ్యాన్స్ ఏర్పడి పోతుంటారు. సింగిల్ పాటతో పాపులర్ అయిపోవడం బాగుండడంతో హీరోయిన్లుగా చేస్తున్నవారు సైతం ఇతర సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు.

కరీనా కపూర్బాలీవుడ్ అగ్ర తారల్లో కరీనా కపూర్ ఒకరు. ఆమె ప్రముఖ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే .. అప్పుడప్పుడు వచ్చే ఐటెం సాంగ్స్ ను వదలడం లేదు. డాన్ సినిమాలో “ఏ మేరా దిల్ ” పాటతో పాటు, చమ్మక్ చల్లో, ఫెవికాల్ సే వంటి పాటలతో అదర గొట్టింది. ఈ పాటలకు ఈమె రూ.5 కోట్లు తీసుకుని.. ఐటెం సాంగ్స్ కు ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునే భామగా నిలిచింది.

సన్నీలియోన్
నీలి చిత్రాల సుందరి సన్నీలియోన్ చాలా వేగంగా పాపులర్ అయింది. ఆమెను చూసేందుకు యూత్ ఆసక్తి గా ఉండడంతో గిరాకీ పెరిగింది. ఒక సినిమాలో కనిపించడానికైనా, పాటలో అందాల ఆరబోతకైనా సన్నీ రూ. 3 కోట్లు తీసుకుంటోంది.

మల్లికా శెరావత్బోల్డ్ సుందరి మల్లికా శెరావత్ కి కుర్రకారుని ఎలా ఆకర్షించాలో బాగా తెలుసు. అందుకే ఆమె చాలా కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతూ ఉంది. “మయ్యా .. మయ్యా” అంటూ బెల్లి డాన్స్ తో ప్రేక్షకుల గుండెల్ని మెలి తిప్పింది. ఈ సుందరి పాటకు రూ.1.5 కోట్లు అడుగుతోంది.

మలైకా అరోరాపెళ్లి అయి పిల్లలున్నా ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకున్న నటి మలైకా అరోరా. దబాంగ్ సినిమాలో ఆమె చేసిన పాట “మున్ని బద్నామ్” సినిమాకు ప్లస్ అయింది. ఈ అమ్మడు ఒక పాటకు కోటి తీసుకుంది. తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాలో “కెవ్వుకేక” పాటకు కూడా అంతే మొత్తం అందుకుంది.

బిపాషా బసుహీరోయిన్ గా డిమాండ్ తగ్గిపోవడం తో ఐటెం సాంగ్ బాట పట్టిన ముద్దుగుమ్మ బిపాషా బసు. “బీడీ జి లైలా” ఐటెం సాంగ్ తో బిప్స్ ఓ ఊపు ఊపింది. దీంతో ఆమె పాటకు రూ.కోటి చార్జ్ చేస్తోంది.

జాక్విలిన్ ఫెర్నాడజ్ప్రస్తుతం బాలీవుడ్ లో ఐటెం సాంగ్ లతో బిజీగా ఉన్న భామ జాక్విలిన్ ఫెర్నాడజ్. రామయ్య వస్తావయ్యా (హిందీ) సినిమాలో “జాదూ కి జప్పి” పాటలో ఆమె డాన్స్ చూసిన తర్వాత నిర్మాతలు క్యూ కట్టారు. ఒక పాటకు రూ.40 లక్షలు చొప్పున సంపాదిస్తోంది.

సమీరా రెడ్డిబాలీవుడ్, టాలీవుడ్ లోనూ హీరోయిన్ గా ప్రవేశించిన సమీరా రెడ్డి విజయాలు అందుకోక పోవడం తో ఐటెం సాంగ్ గర్ల్ గా మారిపోయింది. ఒక్కో పాటకు రూ.25 లక్షలు వసూల్ చేస్తూ బాగానే వెనకేసుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus