పూర్తిగా మారిపోయిన బాహుబలి ప్రధాన నటీనటులు

Advertisement

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో పాటు బాహుబలి చిత్రం కోసం ప్రభాస్, రానా, అనుష్కలు ఐదేళ్లు కేటాయించారు. ఒక యజ్ఞంలా చేశారు. తెలుగువారు గర్వించే కళాఖండాన్ని అందించారు. వారి కష్టానికి తగ్గట్టు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం వచ్చిన పేరుని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ముగ్గురు తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. సుజీత్ దర్శకత్వంలో బాహుబలి ప్రభాస్ “సాహో” సినిమా చేస్తుండగా, దేవసేన అనుష్క “భాగమతి” రూపంలో దర్శనమిస్తోంది. ఇక రానా అయితే తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

నేనే రాజు నేనే మంత్రి అని పొలిటికల్ లీడర్ గా అదరగొట్టిన రానా ఇప్పుడు అడివిరాముడిగా ఏనుగులతో సావాసం చేస్తున్నారు. ఇలా ముగ్గురూ పూర్తిగా బాహుబలి చిత్రాల లుక్ నుంచి బయటికి వచ్చి వేరే లుక్ ల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే ఓ మ్యాగ్ జైన్ కు ప్రభాస్ ఇచ్చిన స్టిల్స్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. అనుష్క “భాగమతి” రోల్ లో మరోసారి జీవించేసారు. మరో అరుంధతి వంటి హిట్ కొట్టేసేటట్టు ఉన్నారు. ఇక అడవిరాముడులో రానా గెటప్ కొత్తగా ఉంది. వీరి ముగ్గురు ఫోటోలు సోషల్ మీడియాలో లైక్లు, షేర్లు అందుకుంటున్నాయి. వీరి సినిమాలు కూడా విజయం సాధిస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus