The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్'(The RajaSaab) సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి ఆటకే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దర్శకుడు మారుతి మంచి కాన్సెప్ట్ ను తీసుకున్నప్పటికీ.. ప్రభాస్ స్టార్ డమ్ ని హ్యాండిల్ చేయలేకపోయాడని, క్లైమాక్స్ మినహా ఆసక్తికర అంశాలు సినిమాలో లేవని, అలాగే నాయనమ్మ పాత్రకి తప్ప మిగిలిన ఏ పాత్రకి కూడా సరైన ఆర్క్ లేదని… కరెక్ట్ గా తీసి ముందుగా అనుకున్నట్టు డిసెంబర్ లేదా సమ్మర్ టైమ్ కి సినిమాని రిలీజ్ చేసుంటే.. బెటర్ రిజల్ట్ అందుకునేదని  అంతా అభిప్రాయపడ్డారు.

The RajaSaab

ఇక థియేట్రికల్  రన్ ముగిశాక తాజాగా ‘జియో హాట్ స్టార్’ ఓటీటీలో ‘ది రాజాసాబ్’ డిజిటల్ రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా టాక్ ఏమీ మారలేదు. ఆల్మోస్ట్ సేమ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. అదనంగా ప్రభాస్ ఫేస్ స్వాపింగ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ట్రోలింగ్ కూడా నడుస్తుంది. అయితే ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఫైట్ సీక్వెన్స్ ఎపిసోడ్ కోసం చాలా మంది ప్రేక్షకులు మళ్ళీ ఓటీటీ వెర్షన్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాటికైతే మంచి రెస్పాన్స్ వినిపిస్తుంది.

రిలీజ్ రోజునే ఈ వెర్షన్ అందుబాటులో ఉండుంటే బాగుండేది అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఏదైతేనేం ‘ది రాజాసాబ్’ కి ధియేటర్లలో జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా.. నిర్మాతకి కలిసొచ్చేది ఏమీ ఉండదు. కానీ జియో హాట్ స్టార్ మాత్రం ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న విధానానికి అందరూ మెచ్చుకోవాల్సిందే.

‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus