సీక్రెట్ లీక్ అయిపోయిందా??

  • April 25, 2017 / 10:34 AM IST

బాహుబలి సినిమా మొదటి భాగం చివర్లో మొదలయిన ఒక ప్రశ్న ఇప్పుడు బాహుబలి చివరి భాగానికి ఊపిరిగా నిలిచింది…అసలు కట్టప్ప…బాహుబలిని ఎందుకు చంపాడు? బాహుబలిని దేవుడీలాగా పూజించే కట్టప్ప…అలా చెయ్యడం పై చాలా ఆసక్తి నెలకొంది…అయితే దానికి సమాధానమే ఈ రెండో భాగం అంటూ చివర్లో ట్విష్ట్ ఇచ్చి స్శపెన్స్ క్రియేట్ చేశాడు మన దర్శకుడు…ఇక ఇదే టాపిక్ పై ఎక్కడికక్కడ చర్చ నెలకొన్న విషయం తెలిసిందే…ఇదిలా ఉంటే….ఈ టాపిక్ పై రకరకాల విశ్లేషణలు…సినిమా వాళ్ళ నుంచి రాజకీయ ప్రముఖులు వరకూ ఈ ట్విష్ట్ నూ తమకు తగ్గట్టుగా మాట్లాడుకుంటూ…ఒకరిపై మరొకరు జోక్స్ వేసుకుంటూ…ఉన్నారు….అయితే మరో మూడు రోజుల్లో ఆ ప్రశ్నకు సమాధానం తెలుస్తుండగా ఈ క్రమంలో కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడే ఆ సీక్రెట్ బయటకు వచ్చేసింది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది….టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం…శివగామి ఆజ్ఞలను శిరసా పాటించే కట్టప్ప ఆమె ఆజ్ఞ మేరకే బాహుబలిని చంపాడని అంటున్నారు.

అలా ఎందుకంటే భళ్లాలదేవ, బిజ్జల దేవ బాహుబలి మీద వ్యతిరేకంగా శివగామికి చెప్తారట. ఈ క్రమంలో వారు చెప్పిన విషయాలను నమ్మిన శివగామి కట్టప్ప ద్వారా బాహుబలిని చంపమని ఆదేశిస్తుందట. అందుకే మొదటి పార్ట్ లో తాను చేసిన తప్పులకు తన ప్రాణాలు అడ్డుపెట్టి శివుడిని కాపాడుతుంది. ఇది నిజంగా శివగామి కుట్రేనా లేక మరేంటి.. ఈ ప్రశ్నకు సమాధానం మరో మూడు రోజుల్లో తెలుస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే…ఈ ట్విష్ట్ చాలా షాక్  ను ఇవ్వబోతుంది అన్నది మాత్రం స్పష్టంగా మారేలాగా కనిపిస్తుంది…చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus