అందుకే రంగస్థలం 1985 రిలీజ్ వాయిదా పడుతోంది

  • October 14, 2017 / 01:05 PM IST

ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. “రంగస్థలం 1985 ” అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రామీణ యువకుడిగా చెర్రీ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలు కావడం లోనే ఆలస్యం జరిగింది. ముగింపు విషయంలోనూ అలాగే జరుగుతోంది. షూటింగ్ వాయిదాలతో పాటు రిలీజ్ లోను వాయిదాలమీద వాయిదాలు పడుతోంది. మొదట క్రిస్ మస్, తరవాత సంక్రాంతి. ఇప్పుడు జనవరిలోకూడా సినిమా రాదని తెలిసింది. కారణం ఏంటంటే.. గ్రాఫిక్స్. బాహుబలి తర్వాత ఆడియన్స్ అంచనాలు పెరిగిపోయాయి. సాధారణ గ్రాఫిక్స్ అంగీకరించే పరిస్థితుల్లో లేరు.

అందుకే ఆ రేంజ్ లో గ్రాఫిక్స్ చేయాల్సి వస్తోంది. ఆ అవుట్ ఫుట్ కోసం మరింత ఆలస్యం అవుతోంది. ఇక చేసేది లేక రిలీజ్ ని వాయిదా వేస్తున్నారు. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనుంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రం థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus