తమన్నా పాత్రకి ఫస్ట్ ఛాయిస్ అనుష్కనే… ప్రభాస్ ‘రెబల్’ మూవీ సీక్రెట్..!

  • November 6, 2020 / 09:05 PM IST

‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి చిత్రాలతో హిట్లు కొట్టి.. ప్రభాస్ మళ్ళీ ఫామ్లోకి వచ్చిన రోజులవి. ఆ రెండు హిట్ సినిమాల తరువాత ‘రెబల్’ అనే మాస్ సినిమా ప్రభాస్ నుండీ వస్తుంది అంటే.. అంచనాలు పీక్స్ లో ఉండడం సహజం. అయితే ఆ అంచనాలను ‘రెబల్’ మూవీ మ్యాచ్ చెయ్యలేదు. ప్రభాస్ ఇమేజ్ వల్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. ‘రెబల్’ కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఈ చిత్రం చూస్తున్నప్పుడల్లా దర్శకుడు లారెన్స్ ను టార్గెట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూనే వస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం.

‘రెబల్’ అనే మంచి టైటిల్ ను లారెన్స్ నాశనం చేసేసాడు అనే కామెంట్స్ కూడా వారు చేస్తూనే ఉన్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘రెబల్’ చిత్రానికి సంబంధించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ఒకటి ఉంది. అదేంటంటే.. మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క ను అనుకున్నారట. తమన్నా ప్లేస్ లో అనుష్క నే నటించాల్సి ఉంది. కానీ ఆ టైములో అనుష్క రెండు తమిళ ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో చెయ్యలేను అని చెప్పిందట.

అయినా సరే.. ప్రభాస్ అండ్ టీం ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేశారట. అయితే అనుష్కతో ‘రెబల్’ కోసం కాస్త బరువు తగ్గాలని లారెన్స్ సూచించాడట. దానికి ఆమె హర్ట్ అయ్యి ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నట్టు అప్పట్లో కథనాలు వినిపించాయి. ‘రెబల్’ కు ముందు లారెన్స్ డైరెక్ట్ చేసిన ‘డాన్’ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus