ఎన్టీఆర్ కీలక నిర్ణయం వెనుక బలమైన కారణం!

  • October 7, 2018 / 03:24 AM IST

ఎన్ని రోజులైనా నాన్ స్టాప్ గా శ్రమించే శక్తి ఎన్టీఆర్ సొంతం. జ్వరం ఉన్నా అదిరే స్టెప్పులు వేసిన సందర్భాలున్నాయి. గాయాలను లెక్కచేయకుండా యాక్షన్ సీన్స్ లో నటించిన సంఘటనలు ఎన్నో. శరీరానికి ఎన్ని దెబ్బలని అయినా తట్టుకున్న ఎన్టీఆర్.. మనసుకు తగిలిన దెబ్బని తట్టుకోలేకపోతున్నారు. అదే తన మనసులో ప్రత్యేకస్థానం కలిగిన తండ్రి హరికృష్ణ మరణించడం. తండ్రి లేని విషయాన్నీ తట్టుకోలేక పోయారు. విలవిలలాడిపోయారు. ఆ బాధలోనే  అరవింద సమేత షూటింగ్ లో పాల్గొన్నారు. రాత్రి పగలు కష్టపడి సినిమాని కంప్లీట్ చేశారు. ముందుగా ప్రకటించినట్లుగా దసరా కానుకగా ఈ నెల 11వ తేదీన సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తారక్ రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. రామ్ చరణ్ కంటే ముందే ఎన్టీఆర్ పైన ఉన్న సన్నివేశాల షూటింగ్  మొదలు పెట్టాలని  రాజమౌళి అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మనసు కుదుటపడేవరకు ఇంటిపట్టునే ఉండాలని డిసైడ్ అయ్యారు. అతని నిర్ణయాన్ని ఆప్తుడు రాజమౌళి గౌరవించారు. #RRR షూటింగ్ ని డిసెంబర్ కి వాయిదా వేశారు. అప్పటికీ కోలుకోకుంటే జనవరిలోనే షూటింగ్ చేయాలని జక్కన్న నిర్ణయం తీసుకున్నారు. అరవింద సమేత విజయం ఎన్టీఆర్ బాధని కొంతైనా తగ్గిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus