చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన నటి అనుష్క. ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే .. మరో వైపు లేడీ ఓరియంటెడ్ మూవీలతో తన ప్రతిభను చాటుకుంది. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉన్న బెంగుళూర్ భామ తాజాగా డైరక్టర్ గౌతమ్ మీనన్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో స్వీటీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
“నేను అరుంధతి సినిమా చేసిన తర్వాత నా వద్దకు అదే తరహా కథలు 12 వరకు వచ్చాయి. ఆ సినిమా హిట్ అయిందని, ఆ జానర్ లో కథ రాస్తే హిట్ అవుతుందని ఆ డైరక్టర్ల భావన. పరిశ్రమలో కష్టపడకుండా, రిస్క్ తీకుకోకుండా సులువుగా విజయం అందుకోవాలని తాపత్రయ పడే లేజీ పీపుల్స్ చాలామంది ఉంటారని అప్పుడు తెలిసింది.” అని అనుష్క చెప్పింది. “కొంతమంది దర్శకులు కొత్తగా ఆలోచిస్తారు.. అలా నాకు ఇంట్రస్ట్ గా అనిపించినా కథలను సెలక్ట్ చేసుకుంటాను. అలంటి వాటిలో వేదం, రుద్రమదేవి, బాహుబలి.. ఉన్నాయి. ఒకసారి సినిమా ఒప్పుకున్నాక ఎంత కష్టమైన పడుతాను.” అని స్వీటీ తన సక్సస్ సీక్రెట్ ని వెల్లడించింది.