ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు : నిక్కీ గల్రాని

  • April 9, 2019 / 04:14 PM IST

సునీల్ హీరోగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘కృష్ణష్టామి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమయ్యింది నిక్కీ గల్రాని. ఈమె మరెవరో కాదు మన ప్రభాస్ ‘బుజ్జిగాడు’ చిత్రంలో మరో హీరోయిన్ గా నటించిన సంజనకి నిక్కీ స్వయానా చెల్లెలు. అయితే ‘కృష్ణాష్టమి’ చిత్రం ప్లాపవ్వడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అడపా దడపా సినిమాలు చేస్తూ గడుపుతుంది. ఇక తమిళంలో ఆమె నటించిన తాజా చిత్రంగా ‘కీ’. ఆర్.బి.చౌదరి కొడుకు జీవా హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కాబోతుంది.

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ‘వెండితెర పై అందంగా కనిపించడానికి కెమెరామెన్లతో హీరోయిన్లు లింకులు పెట్టుకుంటారు అనే ప్రచారంలో ఎంతవరకూ నిజం వుంది?’ అనే ప్రశ్నకి ఆమె తనదైన శైలిలో సమాధానిమిచ్చింది .. “హీరోయిన్లు తెర పై మరింత అందంగా కనిపించడంలో కెమెరామెన్ల పాత్ర ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతమాత్రాన వాళ్ళతో హీరోయిన్లకి సంబంధాలు ఉంటాయనుకోవడం చాలా పొరపాటు. సినిమా బాగా రావాలంటే వాళ్ళ పని వాళ్ళు .. మా పని మేము చేసుకుంటూ ఉంటాము. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవించుకుంటూ ఉంటాము. అంతే తప్ప మరే లింకులు ఉండవు” అంటూ స్పందించింది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus