24 గంటల్లోనే లక్ష లైకులు..

తమిళ నటుడు విజయ్, అమీ జాక్సన్, సమంత లు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తేరి. రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఆదివారం విడుదల చేయగా..

కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడంతో పాటు, లక్ష లైకులను సొంతం చేసుకుంది. జి‌వి ప్రకాష్ అందించిన నేపధ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus