Actress: ఆ హీరోయిన్ల ఇష్టాలు మాములుగా లేవుగా..!

స్టార్ హీరోయిన్లు తమ అందాన్ని.. ఫిజిక్ ను మైంటైన్ చేయడానికి డైట్ ఫాలో అవుతూ ఉంటారు.. కానీ తమకు ఇష్టమైన ఫుడ్ ఎదురుగా కనిపిస్తే మాత్రం ఎటువంటి డైట్ ఫాలో అవ్వరని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అభిమానులు కూడా తమ అభిమాన తారల ఇష్టమైన ఆహారాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి మన స్టార్ హీరోయిన్స్ ఫేవరెట్ ఫుడ్ గురించి ఇప్పుడు చూద్దాం.

కాజల్ అగర్వాల్

ముంబై కి చెందిన ఈ ముద్దుగుమ్మకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమట. వీటితోపాటు స్వీట్స్, కేకులు అంటే చాలా ఇష్టం అని.. ఇక డైట్ ఫాలో అవుతున్న నేపథ్యంలో వారానికి ఒక్కసారి అయినా ఫుల్లుగా లాగించేస్తూ ఉంటానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

సమంత

అక్కినేని మాజీ కోడలు సమంతకు స్వీట్ పొంగల్, హాట్ ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టమట. ముఖ్యంగా కూరగాయల వంటకాలు, సాంబార్ రైస్, పాలకోవా అంటే చాలా ఇష్టం అని సమాచారం.

తమన్నా

మిల్క్ బ్యూటీ తమన్నాకి కూడా బిర్యాని అంటే చాలా ఇష్టమని.. వీటితోపాటు ఇండియన్, కాంటినెంటల్ ఫుడ్స్ ను , వారంలో రెండు రోజులు వెజిటేరియన్ ఫుడ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది.

అనుష్క

అనుష్కకి కూడా చికెన్ అంటే చాలా ఇష్టం అని… ముక్క లేనిదే ముద్ద దిగదని చెబుతూ ఉంటుంది. ఇకపోతే డైట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది అని సమాచారం.

రష్మిక మందన్న

స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు దోశ అంటే చాలా ఇష్టమట. వీటితోపాటు నార్త్ ఇండియన్ వంటకాలు అంటే కూడా ఇష్టమట.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus