ప్రెగ్నెస్నీ రాకుండానే తల్లిని చేసేశారు

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక్క ఏడాదిలో చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. కాని కొంత మంది హీరోయిన్స్ మాత్రం వస్తే అలానే పదేళ్ల పాటు పాతుకుపోతారు. ఎంత మంది సెక్సీ హీరోయిన్స్ వచ్చినా ఆ భామల స్థానాలకు ఎటువంటి డోకా ఉండదు. అలాంటి వారిలో బిపాషా బాసు కూడా ఉంది. అమ్మడు మోడలింగ్ లో ఉన్నప్పుడే ఎంతో క్రేజ్ అందుకుంది. సోషల్ మీడియా కూడా అప్పుడు ఎక్కువగా వాడకంలో లేదు. అయినా బిపాసా తన అందాలతో కుర్రకారు మతిపోగెట్టేది. ఆమె పోస్టర్లు బ్యాచులర్ రూమ్స్ లలో ఎక్కువగా కనిపించేవి. హారర్ యాక్షన్ లవ్ ఇలా అన్ని తరహా సినిమాలను చేసింది. అయితే 2015 వరకు కెరీర్ ను బాగానే కొనసాగించిన ఈ బ్యూటీ లవ్ లో పడి సినిమాలకు ఎండ్ చెప్పేసింది. 2016 లో యాక్టర్ కరణ్ సింగ్ గ్రోవేర్ ను వివాహమాడి మ్యారేజ్ లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే అప్పుడపుడు సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లో ఉంటోంది.

ఇక అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా అమ్మడిపై కొన్ని రూమర్స్ బాగానే వచ్చాయి. ఆమె ప్రెగ్నెంట్ అని రూమర్స్ ఓ రేంజ్ లో రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె సన్నిహితులు మాత్రం అందులో నిజం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం బిపాసా గోవాలో తన భర్తతో ఎంజాయ్ చేస్తోంది. అక్కడే హాట్ డ్రెస్సుల్లో ఫొటోలకు స్టిల్స్ ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇక కొంత మంది నెటిజన్స్ గుడ్ న్యూస్ నిజమేనా అని కామెంట్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus