సినిమా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సన్నివేశాలు

  • December 4, 2017 / 06:35 AM IST

కొన్ని సినిమాలు చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చినా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని సీన్స్ ని అయితే మరువలేము. ఫ్రెండ్స్ తో ఆ సీన్ గురించే మాట్లాడతాం. అంతేకాదు ఆ సినిమా పేరు మనం వింటే చాలు.. మదిలో ముద్రపడిన సన్నివేశం గురించి చెబుతాం. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లోని హైలెట్ సీన్స్ పై ఫోకస్

బాహుబలి బిగినింగ్కట్టప్ప.. శివుడి కాలుని తలపైన పెట్టుకొనే సన్నివేశం బాహుబలి బిగినింగ్ సినిమాలో ఓ మలుపు మాత్రమే కాదు.. లక్షల హృదయాలను గెలుచుకుంది.

బాహుబలి కంక్లూజన్దేవసేన ని దోషిగా నిలబెట్టినప్పుడు బాహుబలి సేతుపతి తల నరికే సన్నివేశం విజిల్స్ వేయించింది. మరచి పోలేనంతగా ముద్రపడిపోయింది.

బాహుబలి కంక్లూజన్అద్భుత కళాఖండంలో మరో సీన్ హైలెట్ గా నిలిచింది. అదే భల్లాల దేవా పట్టాభిషేకం. బాహుబలి అని ప్రజలు అరవడం అదరగొట్టింది.

టెంపర్పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన టెంపర్ సినిమా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ తానే రేప్ చేశానని చెప్పే సీన్ కిరాక్ పుట్టించింది.

పోకిరిపోకిరి సినిమాలో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ గా పరిచయం అయ్యే సీన్ ఎన్నేళ్లు అయినా మరచిపోలేము.

శివవర్మ బ్లాక్ బస్టర్ మూవీ శివ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా నాగార్జున సైకిల్ చైన్ లాగే సన్నివేశం నుంచే మొదలు పెడుతారు.

జై లవ కుశఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేసిన జై లవ కుశ లో జై ఎంట్రీ సీన్ మామూలుగా ఉండదు. అందుకే ప్రత్యేకంగా నిలిచింది.

ఇంద్రఇంద్ర సినిమాలో ఎన్నో హైలెట్ సీన్స్ ఉన్నాయి. అయినా ప్రకాష్ రాజ్ .. చిరంజీవి వద్దకి వచ్చి రియలైజ్ అయ్యే సీన్ అద్భుతం.

ఠాగూర్కోర్ట్ సీన్ కి తెలుగు సినిమాకి మంచి అనుబంధం ఉంది. ఠాగూర్ సినిమాలో చిరు నటించిన కోర్ట్ సీన్ మరింత సంచలనం సృష్టించింది.

లెజెండ్తొమ్మిది నంది అవార్డులు అందుకున్న లెజెండ్ సినిమాలో తమ కుటుంబం కష్టాల్లో ఉందని గుడి దగ్గర రీ ఎంట్రీ ఇచ్చే సన్నివేశం చాలా బాగా ఆకట్టుకుంది.

ఖడ్గంప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే సినిమా ఖడ్గం. ఇందులోని అనేక హైలెట్ సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ మేము ఇండియన్స్ అని శ్రీకాంత్ కి చెప్పే ప్రీ క్లైమాక్స్ సీన్ సూపర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus