Srinidhi Shetty: ఆ తప్పే కేజీఎఫ్ హీరోయిన్ కెరీర్ కు మైనస్ అయిందా?

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల ద్వారా పాపులర్ అయిన హీరోయిన్లలో శ్రీనిధి శెట్టి ఒకరు. ఆమె అభినయం మరీ అద్భుతంగా లేకపోయినా కేజీఎఫ్, కేజీఎఫ్2 సక్సెస్ కావడంతో ప్రేక్షకుల్లో శ్రీనిధికి మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఈ హీరోయిన్ కు ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈ హీరోయిన్ ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో నిర్మాతలు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడం కష్టమని చెబుతున్నారని బోగట్టా. కేజీఎఫ్ హీరోయిన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు వెలువడకపోవడానికి అసలు కారణం ఇదేనని సమాచారం.

కేజీఎఫ్ హీరోయిన్ మరికొన్ని విజయాలు సాధించిన తర్వాతే రెమ్యునరేషన్ పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శ్రీనిధి శెట్టి ఇదే విధంగా వ్యవహరిస్తే ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి ఎంతో సమయం పట్టదని నెటిజన్లు చెబుతున్నారు. కేజీఎఫ్2 సక్సెస్ తర్వాత అటు ప్రశాంత్ నీల్ ఇటు యశ్ కొత్త ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు. శ్రీనిధి శెట్టి కెరీర్ మాత్రం పుంజుకోలేదు. కెరీర్ విషయంలో శ్రీనిధి ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శ్రీనిధి కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తే దర్శకనిర్మాతలు కూడా ఆమెను పట్టించుకునే అవకాశం లేదు. కేజీఎఫ్, కేజీఎఫ్2 సక్సెస్ సాధించినా ఆ సక్సెస్ లో శ్రీనిధికి ఎక్కువగా ప్రాధాన్యత దక్కలేదు. కేజీఎఫ్ హీరోయిన్ కు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల నుంచి ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. కేజీఎఫ్ హీరోయిన్ స్టార్ హీరోలతో పాటు మిడిల్ రేంజ్ హీరోలకు కూడా ప్రాధాన్యతనిస్తే మాత్రమే ఆమె కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.

రెమ్యునరేషన్ వల్ల వచ్చిన ప్రతి ఆఫర్ ను రిజెక్ట్ చేసుకుంటూ వెళితే ఆమె ఇండస్ట్రీకి దూరం కావడానికి ఎంతో సమయం పట్టదు. కెరీర్ విషయంలో ఎలా వ్యవహరించాలో ప్రశాంత్ నీల్, యశ్ ఆమెకు సూచిస్తే మంచిదని చెప్పవచ్చు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.