శుక్రవారం పోటీకి సిద్ధమైన నలుగురు హీరోలు.. విజయం ఎవరిదో

  • December 19, 2019 / 12:41 PM IST

ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర ఒక నాలుగు సినిమాలు పోటీ పడడం కామన్ అయినప్పటికీ.. ఈ శుక్రవారం పోటీ మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది. అందుకు కారణం.. రెండు తెలుగు స్ట్రైట్ సినిమాలకు.. రెండు డబ్బింగ్ సినిమాలు గట్టి పోటీ ఇస్తుండడం మాత్రమే కాదు.. ఇద్దరు యంగ్ హీరోస్ తో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతుండడమే. తెలుగులో స్ట్రయిట్ గా విడుదలవుతున్న “రూలర్” చిత్రానికి “ప్రతిరోజూ పండగే” గట్టి పోటీ ఇస్తుండగా.. కార్తీ “దొంగ”కు సల్మాన్ ఖాన్ “దబంగ్ 3” పోటీగా నిలుస్తుంది. నిజానికి నాలుగు సినిమాలు నాలుగు విభిన్నమైన జోనర్లు.. కానీ సినిమా క్రేజ్ పరంగా చూసుకుంటే యంగ్ హీరోలదే పైచేయి.

“రూలర్” ట్రైలర్, సాంగ్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోగా.. “ప్రతిరోజూ పండగే” చిత్రానికి ట్రైలర్, సాంగ్స్ ఆల్రెడీ జనాలని విశేషంగా ఆకట్టుకొని ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఇక “దబంగ్ 3, దొంగ” సినిమాలకు తెలుగులో పెద్దగా క్రేజ్ లేదు. కానీ.. సల్మాన్ ఖాన్, కార్తీలకు మంచి గుర్తింపు, మార్కెట్ ఉంది కాబట్టి.. సినిమా బాగుంది అనే టాక్ వస్తే తప్పకుండా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఈ రకంగా చూసుకుంటే.. ప్రస్తుతానికి విజేత ఎవరు అనేది గెస్ చేయడం కష్టమే. రేపు సాయంత్రానికి తెలిసిపోతుంది ఎవరు విన్నర్ అని.

1.రూలర్

2.ప్రతిరోజూ పండగే

3.దొంగ

4.దబంగ్ 3

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus