ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే రికార్డ్ క్రియేట్ చేసిన ‘తొలి ప్రేమ’

  • February 9, 2018 / 07:03 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్.. ఫిదా మూవీ తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా.. ఈ రెండు అంశాలు తొలిప్రేమ సినిమాపై భారీ క్రేజ్ ని తీసుకొచ్చాయి. కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ప్రేమ కథను కొత్తగా ఆవిష్కరించారన్న సంగతి టీజర్, ట్రైలర్ స్పష్టం చేసింది. అలాగే వరుణ్ తేజ్, రాశీ ఖన్నాల జోడి అదరహో అనిపించింది. ఇవన్నీ కలిసి “తొలి ప్రేమ” కి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగేలా చేశాయి. బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ 23 కోట్లకు అమ్ముడు పోయి వరుణ్ తేజ్ స్థాయిని పెంచింది. రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఏరియాల వారీగా పలికిన థియేట్రిక‌ల్ రైట్స్‌ వివరాలు…

ఏరియా బిజినెస్ (కోట్లలో)
నైజాం : 6.0
సీడెడ్ : 3.0
వైజాగ్ : 2.5
గుంటూరు : 2.0
కృష్ణా : 1.6
ఈస్ట్ గోదావరి : 1.6
వెస్ట్ గోదావరి : 1.4
నెల్లూరు : 0.9
క‌ర్నాట‌క : 0.8
ఇతర రాష్ట్రాల్లో : 0.2
ఓవ‌ర్సీస్ : 3.0

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus