తొలి ప్రేమ ఫస్ట్ వీక్ కలక్షన్స్

‘తొలి ప్రేమ’ టైటిల్ మెగా హీరోలకు బాగా కలిసి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ టైటిల్ తో సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన తొలిప్రేమ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది. ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 3.21 కోట్ల షేర్ వసూలు ఔరా అనిపించింది. ఈ చిత్రం మొదటి వారానికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 14.03 కోట్ల షేర్ ను అందుకుంది. ఏరియాలవారీగా షేర్….

ఏరియా వసూళ్లు
నైజాం : 5.40 కోట్లు
సీడెడ్ : 1.70 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.15 కోట్లు
ఈస్ట్ గోదావరి :1.18 కోట్లు
వెస్ట్ గోదావరి : 93 లక్షలు
కృష్ణ : 1.07 కోట్లు
గుంటూరు : 1.14 కోట్లు
నెల్లూరు : 43 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో: 14.03 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus