తొలి ప్రేమ రెండు వారాల కలక్షన్స్

  • February 24, 2018 / 01:58 PM IST

వెంకీ అట్లూరి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన ‘తొలి ప్రేమ’ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది. తొలి రోజు నుంచి మంచి టాక్ సొంతం చేసుకొని హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధించింది. ఈ చిత్రం మొదటి వారానికి ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 14.03 కోట్ల షేర్ ను అందుకుంది. రెండో వారంలో థియేటర్లు తగ్గినప్పటికీ కలక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. రెండు వారాల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల షేర్ వసూళ్లు చేయగా… తెలుగు రాష్ట్ర్రాల్లో 17 కోట్ల షేర్ రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలక్షన్స్..

ఏరియా వసూళ్లు
నైజాం : 6.60 కోట్లు
సీడెడ్ : 2.05 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.76 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1.48 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.15 కోట్లు
కృష్ణ : 1.34 కోట్లు
గుంటూరు : 1.34 కోట్లు
నెల్లూరు : 0.54 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో: 17 .26 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus