‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలోని కొంత పార్ట్ చూసిన తర్వాత ప్రభాస్ అసంతృప్తిగా ఉన్నాడని.. వాటిని రీషూట్ చేయమని కోరినట్టు కూడా వార్తలొచ్చాయి. దీంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది అనేది కూడా చెప్పలేం అంటూ టాక్ నడిచింది. అయితే ఈ వార్తలు విన్న ప్రభాస్ చాలా అప్సెట్ అయ్యాడట.
దీంతో వెంటనే చిత్ర యూనిట్ రంగంలోకి దిగి… ఈ విషయాల పై క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ అబద్దపు ప్రచారాలే అని చిత్ర యూనిట్ అంటూ చెప్పుకొచ్చింది. కొన్ని సీన్స్ విషయంలో చాలా వరకు ప్రభాస్ సంతృప్తిగా లేడని ఆ సన్నివేశాలను రీషూట్ చేస్తున్నామంటూ వచ్చిన వార్తల్లో అస్సలు నిజం లేదు. ఆ వార్తల్ని నమ్మకండి. ఈ వార్తలు విన్నతరువాత ప్రభాస్ కూడా చాలా హర్ట్ అయ్యారు. దీంతో పాటూ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతుందని టాక్ నడిచింది. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. కచ్చితంగా సినిమా ఆగస్టు లోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.