లాక్ అయిన బాహుబలి కంక్లూజన్ కీలక తేదీలు!

  • March 9, 2017 / 01:54 PM IST

బాహుబలి కంక్లూజన్ సినిమా ఏప్రిల్ 28 న అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ డేట్ లో మార్పు ఉండదని రాజమౌళి స్పష్టం చేశారు. ఇక ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ డేట్స్  కూడా ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఈనెల 15 న ముంబై వేదికగా, బాలీవుడ్ స్టార్స్ సమక్షంలో బాహుబలి 2  ట్రైలర్ విడుదల చేయనున్నారు. అదే విధంగా ఎం ఎం కీరవాణి స్వరపరిచిన పాటలను రామోజీ ఫిలిం సిటీలోని మాహిష్మతి రాజ్యం లో విడుదల చేసేందుకు జక్కన్న డిసైడ్ అయ్యారు. మార్చి 26 న ఆదివారం ఈ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ రెండు తేదీలను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నిర్మాతలు వెల్లడించనున్నారు. బాహుబలి బిగినింగ్ కేవలం స్టారర్ మాత్రమే, రెండో పార్ట్ అసలైన విందు భోజనమని రీసెంట్ గా దర్శకధీరుడు చెప్పారు. అటువంటి సినిమా ట్రైలర్ చూసేందుకు, పాటలు వినేందుకు బాహుబలి అభిమానులు  ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus