కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life ) అనే భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. శింబు, త్రిష వంటి స్టార్స్ ఇందులో నటించడం, టీజర్,ట్రైలర్స్ వంటివి ఇంప్రెస్ చేయడంతో సినిమాపై బజ్ ఏర్పడింది. ‘నాయగన్’ తర్వాత.. అంటే దాదాపు 37 ఏళ్ళ గ్యాప్ తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడం కూడా ఆ బజ్ కు కారణమైంది అని చెప్పొచ్చు. కానీ జూన్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది.
టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.. కానీ 2వ రోజు నుండి డౌన్ అయ్యింది. తర్వాత గ్రోత్ చూపించింది లేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.73 cr |
సీడెడ్ | 0.24 cr |
ఉత్తరాంధ్ర | 0.25 cr |
ఈస్ట్ | 0.11 cr |
వెస్ట్ | 0.08 cr |
గుంటూరు | 0.15 cr |
కృష్ణా | 0.18 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 1.82 cr (Share) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 0.20 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 2.02 cr (Share) |
‘థగ్ లైఫ్’ (Thug Life) కి తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా రూ.2.02 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.22 కోట్లు అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.48 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.