కమల్ హాసన్(Kamal Haasan) -మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో 37 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన ‘థగ్ లైఫ్’ (Thug Life) చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రన్ ను కొనసాగిస్తుంది.జూన్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. కానీ 2వ రోజు కలెక్షన్స్ తగ్గిపోయాయి. తర్వాత వీకెండ్ ను మినిమమ్ క్యాష్ చేసుకోలేకపోయింది ఈ సినిమా.వీక్ డేస్ కి ఎంటర్ అయ్యాక పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.
చాలా ఏరియాల్లో డెఫిసిట్లతో రన్ అవుతుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.79 cr |
సీడెడ్ | 0.26 cr |
ఉత్తరాంధ్ర | 0.28 cr |
ఈస్ట్ | 0.11 cr |
వెస్ట్ | 0.08 cr |
గుంటూరు | 0.16 cr |
కృష్ణా | 0.20 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 1.96 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 0.21 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 2.17 cr (షేర్) |
‘థగ్ లైఫ్’ కి తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజుల్లో ఈ సినిమా రూ.2.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.47 కోట్లు అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.