Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

ఒకే అవార్డు ఇద్దరికి రావడం అంటే కొత్త విషయమే. మన జాతీయ సినిమా పురస్కరాల్లో ఇలా ఒక అవార్డు ఇద్దరికి ఇవ్వడం ఈ మధ్య ఎక్కువైంది అనుకోండి. అయితే ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో మాత్రం ఇలాంటి టైలు పెద్దగా జరగవు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం వచ్చిన ఈ పరిస్థితి ఇప్పుడు మళ్లీ వచ్చింది. ఈ ఏడాది ఆస్కార్‌ పురస్కారాల్లో టై వల్ల ఇద్దరికి అవార్డు ఇస్తున్నట్లు అకాడెమీ అవార్డ్స్‌ ప్రకటించింది. బెస్ట్ లైవ్‌ యాక్షన్‌ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ టై ఏర్పడింది.

Oscar

బెస్ట్ లైవ్‌ యాక్షన్‌ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది సింగర్స్‌’, ‘టూ పీపుల్‌ ఎక్ఛ్సేంజ్‌ సలైవా’ సినిమాలు ఎంపికయ్యాయని ప్రకటించగానే ఆస్కార్స్‌ వేదిక ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు అకాడెమీ అవార్డుల చరిత్రలో ఆరుసార్లు మాత్రమే ఇలా జరిగింది. ఇప్పుడు మరోసారి ఈ పరిస్థితి ఏర్పడటం విశేషం. అంతేకాదు ఈ విషయాన్ని ప్రకటించడం కూడా చాలా కొత్తగా జరిగింది. ప్రజెంటర్ కుమాయిల్ నంజియాని తన చేతిలో ఉన్న ఎన్వలప్ ఓపెన్ చేసి ఏం మాట్లాడలేదు. దీంతో అంతా సైలెంట్‌గా మారింది. ఆ తర్వాత షాక్‌ నుండి తేరుకొని ప్రజెంటర్‌ ‘ఒకే కేటగిరీకి ఇద్దరు విజేతలు’ అని ప్రకటించారు. దీంతో డాల్బీ థియేటర్ చప్పట్లతో మారుమోగింది.

ఇక ఆస్కార్‌ చరిత్రలో టైల సంగతి చూస్తే.. రీసెంట్‌గా అంటే 2012లో ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ పురస్కారాన్ని ‘స్కైఫాల్’, ‘జీరో డార్క్ థర్టీ’ సినిమాలకు ఇచ్చారు. 1994లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్) విభాగంలో ‘ఫ్రాంక్ కాఫ్కాస్ ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్’ ‘ట్రెవర్’ సినిమాలకు వచ్చింది. అలాగే 1986లో ఉత్తమ ఫీచర్ డాక్యుమెంటరీ పురస్కారాన్ని ‘ఆర్టీ షా: టైమ్ ఈజ్ ఆల్ యూ హావ్ గాట్’, ‘డౌన్ అండ్ అవుట్ ఇన్ అమెరికా’ సినిమాలు దక్కించుకునన్నాయి.

ఇక 1968లో కేథరిన్ హెప్బర్న్, బార్బరా స్ట్రీసాండ్ సంయుక్తంగా ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకున్నారు. 1949లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును‘ఏ ఛాన్స్ టు లివ్’, ‘సో మచ్ ఫర్ సో లిటిల్’ అందుకున్నారు. 1932లో వాలెస్ బీరీ, ఫ్రెడ్రిక్ మార్చ్ కలసి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.

2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags