ప్రతి భారతీయుడు గర్వించదగ్గ చిత్రం ‘టిక్ టిక్ టిక్’

“టిక్ టిక్ టిక్ ” విడుదలకు ముందు వరకు అంతరిక్షం నేప‌థ్యంలో రూపొందిన తొలి ఇండియ‌న్ మూవీ గా అందరీ దృష్టిని ఆకర్షించింది.ట్రైలర్ చూడగానే గ్రావిటీ ,ఇంటర్ స్టెల్లార్ లాంటి సినిమాల రేంజ్ లో ఉండటంతో, సహజంగానే ఆడియెన్స్ ఫొకస్ ఈ సినిమా పై మరింత ఎక్కువయింది‌. అందుకెనెమో ,విడుద‌లైన అతి తక్కువ టైమ్ లొనె టిక్ టిక్ టిక్ ట్రైలర్ మిలియన్ వ్యూస్ ను రీచ్ అయింది. ఇక సినిమాగా ఊహకందని కథకథనాలతో , ఎక్స్ ట్రార్డినరీ విజువల్స్ ,గ్రాఫిక్ వర్క్ తొ పాటు, థ్రిల్ కలిగించె సౌండ్ ఎఫెక్ట్ తో “టిక్ టిక్ టిక్” హాలీవుడ్ రేంజ్ లొ ఉందన్న ఫీడ్ బ్యాక్ క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి లభిస్తోంది.సినిమా చూసిన వారందరు ఇదొక విజువల్ ఫీస్ట్ అని, థియేటర్ లొ చూస్తెనె ఆ అనుభూతిని పొందగలమంటున్నారు.

ఇలాంటి స్పేస్ సినిమాల కొసం వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టె హాలీవుడ్ మేకర్స్ కు ధీటుగా , వాటిలో 1% బడ్జెట్ తో ఈ తరహా క్వాలిటీ మూవీని అందించటం సౌత్ ఇండియన్ ఫిలిం‌మేకర్స్ యొక్క గొప్పతనం. మరొపక్క నాసా కు ధీటుగా మన శ్రీహరికొట నుంచి కూడా రీజనబుల్ బడ్జెట్ లొ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెడుతున్నారు.

ఒక భారతీయుడిగా మనందరం గర్వించదగ్గ విషయమిది.ఇక ఇలాంటి విలక్షణమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు ముందుండే చదలవాడ బ్రదర్స్ టిక్ టిక్ టిక్ ను టాలీవుడ్ లొకి అనువదించి మరో సూపర్ హిట్ ను అందుకున్నారు.

తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి , చదలవాడ లక్ష్మణ్ టిక్ టిక్ టిక్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి తమ అభిరుచిని మరోసారి చాటుకున్నారు.గతంలో ఈ బ్యానర్ పై వచ్చిన

బిచ్చ‌గాడు`, డి16 సినిమాల తరహాలొనె జెన్యూన్ హిట్ టాక్ ను టిక్ టిక్ టిక్ తొలి షో నుంచె అందుకుంది. వరుసగా hకంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ మార్క్ ఏర్పరచుకున్న జయం రవి , ఈ సినిమాతో తెలుగులోనూ తనకంటూ సెపరెట్ మార్కెట్ ను క్రియేట్ చెసుకొబొతున్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus