తల్లి పాత్ర కోసం గుణశేఖర్ గారు అడిగితే అందుకే చేయలేదు..!

‘అలా మొదలైంది’ ‘అంతక ముందు ఆ తరువాత’ ‘జెంటిల్ మెన్’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలలో తల్లి పాత్ర చేసిన రోహిణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె నటన చూస్తే… నిజంగా మన కుటుంబలో మనిషి అనే ఫీలింగ్ అందరికీ కలుగక మానదు అనడంలో సందేహం లేదు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో కూడా నటించారు రోహిణి. దాదాపు 80 చిత్రాలకి పైగా హీరోయిన్ గా నటించిన రోహిణి.. ప్రస్తుతం ముఖ్యమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు.

ఇటీవల ఆమె ఓ టీవి ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు.. ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ‘గుణశేఖర్ గారు తల్లి పాత్ర కోసం అడిగితే ఎందుకు చేయలేదు? అదే నందినీ రెడ్డి గారు ‘అలా మొదలైంది’ సినిమాలో తల్లి పాత్ర కోసం అడగ్గానే ఎందుకు ఒప్పుకున్నారు?’ అనే ప్రశ్న రోహిణిబదులిస్తూ.. ” గుణశేఖర్ గారు తల్లి పాత్ర కోసం నన్ను అడిగినప్పుడు నా వయసు 34 మాత్రమే. అందువలన అప్పుడే తల్లి పాత్రలు చేయడమేంటని నాకు అనిపించింది. ఆ తరువాత సంవత్సరం నందినీ రెడ్డి మా ఇంటికి వచ్చారు. తన సినిమాలో తల్లి పాత్ర చేయాలనీ చెప్పారు. అయితే మొదట నేను నో చెప్పాను.. అయితే మా ఇంట్లో మా అబ్బాయితో ఎలా ఉంటానో .. ఆ చిత్రంలో నా పాత్ర కూడా అలాగే ఉంటుందని అన్నారు. ఫ్రెండ్లీ మదర్ అనగానే చేయడానికి అంగీకరించాను. గుణశేఖర్ గారు నాకు నా పాత్ర గురించి వివరించే ప్రయత్నం చేయలేదు. ఒక వేళ వివరించి ఉంటే చేసేదాన్నేమో” అంటూ వివరణ ఇచ్చారు. ఇంతకీ రోహిణి… నో చెప్పిన గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఏమిటా అని… సోషల్ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus