దర్శకుడి పెళ్లిలో నివేదా సందడి

  • December 19, 2020 / 07:43 PM IST

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇటీవల తన ప్రియురాలు శ్రీజా గౌనిని వివాహం చేసుకున్నాడు. ఇక బ్రోచేవారెవరురా చిత్రంలో నటించిన నివేదా థామస్ వారి వివాహనికి సంబంధించిన స్పెషల్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. వేడుకలో ఆ సినిమా కథానాయకుడు నటుడు శ్రీ విష్ణువు కూడా హాజరయ్యారు. ఇక తన సోదరుడు నిఖిల్ థామస్‌తో కలిసి, నివేదా పెళ్లిలో సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. బ్రోచేవారెవరురా సినిమాతో ఆ చిత్ర యూనిట్ సభ్యులందరు కూడా చాలా సన్నిహితంగా ఉంటున్నారు.

ఈ స్నేహితులందరూ వధూవరులతో కలిసి ఉన్న స్పెషల్ పోటొలను షేర్ చేసుకున్నారు. ఫొటోలతో సంగీత స్వరకర్త వివేక్ సాగర్ కూడా ఉన్నారు. ఇలాగే జీవితాంతం సంతోషంగా ఉండండి అంటూ నివేదా స్పెషల్ గా కామెంట్ చేసింది. చాలా ఆనందంగా వుండాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇస్తూ మీ జోడి చాలా అద్భుతంగా ఉందని తెలిపింది. ఇక నెక్స్ట్ ఈ దర్శకుడు నానితో “అంటే సుందరానికి..” అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పెళ్లి వేడుక అనంతరం ఆ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు.

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus