టాలీవుడ్ దర్శకుల్లో ఒక్కొక్కరూ ఒక్క రకమైన ఫొర్ములాతో సినిమాలు తీస్తూ ఉంటారు. సహజంగా ప్రేమ కధలను ఎంచుకుని తెరకెక్కించే సమయంలో తమ జీవితంలో జరిగిన సంఘటనలు, తమ స్నేహితుల జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా కధలు రాసుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతారు. అయితే అలాంటి దర్శకులకే లవ్ స్టోరీ ఉంటే భలే ఉంటుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం మన దర్శకులు , వారి ప్రేమ కధల పై ఒక లుక్ వేద్దాం రండి.
‘బొమ్మరిల్లు’ తో ఒక్కసారిగా స్టార్ డమ్ సమాపాదించుకున్న భాస్కర్ తన హాలిడేని ఎంజాయ్ చేసేందుకు వైజాగ్ వెళ్లాడు. అక్కడ తన డిస్ట్రిబ్యుటర్ క్రాంతి రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి శ్రీ విధ్యను చూసి, ఇష్టపడి, ప్రేమించి 9నెలల్లో పెళ్లి చేసుకున్నాడు.
‘ఎవడే సుబ్రమణ్యం’ వంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత ప్రియాంక దత్ తో కలసి పని చేశారు. ఆలా స్నేహితులైన వీళ్ళ మధ్య ప్రేమ చిగురించి చివరికి పెద్దల్ని ఒప్పించి గత ఏడాది పెళ్లి చేసుకున్నారు.
“చంద్ర లేఖ” చిత్రం షూటింగ్ సమయంలో కృష్ణ వంశీ, రమ్య కృష్ణ ఇద్దరూ ప్రేమలో పడ్డారు, కట్ చేస్తే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు.
పూరీ తన కరియర్ ఆరంభంలో దూరదర్శన్ లో పనిచేసాడు. అక్కడ లావణ్యను చూసు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
మన జక్కన్న, రమా రాజమౌళి ఇద్దరిదీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, మొదటి భర్తతో విడాకులు తీసుకుని, 9ఏళ్ల కొడుకు ఉన్న రమాను ప్రేమించి అందరినీ ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు జక్కన్న.
మచిలీపట్నంలో స్టికరింగ్ షాప్ నడుపుకుంటున్న మారుతి, స్పందన ను అక్కడ చూసి ప్రేమించాడు. అయితే ప్రేమిస్తే సినిమాలో మెక్యానిక్ ఎలా అయితే ఒక అమ్మాయిని ప్రేమించే క్రమంలో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడో, మన మారుతి కూడా అదే పంధాను ఎంచుకున్నాడని చెబుతాడు. ఇక పేదరికంలో పుట్టిన మారుతి, హైదరాబాద్ వచ్చి కొంచెం సెటిల్ అయిన తరువాత అమ్మాయి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
శ్రీకాంత్ అడ్డాల ప్రేమకధ స్వచ్చంగా సీతమ్మ వాకిట్లో సినిమాలో మహేష్-సమంత లవ్ ట్ర్యాక్ లాగానే ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల కూడా అలానే బంధువుల పెళ్లిలో ఒక అమ్మాయిని చూసి నచ్చి ప్రేమించి, “కొత్తబంగారులోకం” హిట్ తరువాత పెళ్లి చేసుకున్నాడు.
తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్రమంలో ఉపేంద్ర హీరోగా తాను డైరెక్ట్ చేసిన సినిమా దాదాపుగా 95% పూర్తయ్యి ఆగిపోగా, అమ్మాయి తరపు బందువులు ఇబ్బంది పెట్టారు. అయితే అందరినీ ఒప్పించి, కొన్నాళ్ళ తరువాత అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సంపత్