అప్పుడెప్పుడో ‘రెబల్’ సినిమా ఆడియో ఫంక్షన్ లో ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు ఓ అభిమాని స్టేజీ పైకి వచ్చేసి… అత్యుత్సాహం చూపించాడు. అప్పుడు ప్రభాస్.. ‘ఎమీ లేదు .. లవ్ అంతే వదిలెయ్యండి’ అనడంతో అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ప్రభాస్ పై తెగ ప్రశంసలు కురిపించేసారు. తరువాత ఈ విషయాన్ని అందరూ మరిచిపోయారు అనుకోండి. మళ్ళీ 5 ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సీన్ రిపీట్ అయ్యింది. అయితే ఈసారి కాస్త డోస్ ఎక్కువే. స్టేజీ పైకి వచ్చిన అభిమాని ఏకంగా పవన్ కళ్యాణ్ ను సెల్ఫీ అడగడం … ఆయన ఓకే చెప్పి సెల్ఫీ ఇవ్వడం జరిగింది.
ఇక మహేష్ బాబు ‘మహర్షి’ ఈవెంట్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఈ హీరోల ఫ్యాన్ బేస్ ఎక్కువ కాబట్టి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నాగ చైతన్య, శర్వానంద్ , విజయ్ దేవరకొండ వంటి హీరోలకు కూడా ఇలాగే జరగడంతో ‘ఇది ఆ ఈవెంట్ వారు ఏర్పాటు చేసే ట్రిక్’ అని ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు. ఇలా చేయడం సెక్యూరిటీ లోపం అని అనడానికి లేదు. కానీ ఇలాంటివి ప్రోత్సహించడం కూడా దర్శక నిర్మాతలకు మంచిది కాదు. ఎందుకంటే.. ఇలా అత్యుత్సాహం చూపించే ఫ్యాన్స్ ఎక్కువైతే ఆ ఈవెంట్ లు డిస్ట్రబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి