4కోట్లతో ‘ప్రొడ్యూసర్’కి షాక్ ఇచ్చిన హీరో!!!

  • November 18, 2016 / 10:57 AM IST

మన ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల్లో బ్లాక్ మనీను అరికట్టేందుకు 500, 1000నోట్లను రద్దు చెయ్యడం చాలా ప్రధానం అయినది…అయితే ఆ నిర్ణయం వల్ల చాలా చోట్లా బ్లాక్ మనీ ట్ర్యాన్స్యాక్షన్స్ భారీగా ఆగిపోయాయి…అందులోనూ ముఖ్యంగా రోజువారీ వేతనాలు ఎక్కువగా ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా కనిపిస్తుంది…విషయంలోకి వెళితే…వారం రోజుల నుంచీ టాలీవుడ్, కొలీవుడ్ ఒక రకమైన షాక్ లో ఉన్నాయి. చాలా చోట్ల ప్రొడక్షన్ లు కూడా ఆపేసి మరీ షూటింగ్ ని నడిపేస్తున్నారు. ఒక హీరో పారితోషికం అంటే సగం కంటే ఎక్కువే బ్లాక్ మనీలో అందేలాగా ఉండేది కానీ ఇక ముందర అది కుదురుతుందా లేదా అనేది తెలియాల్సిన పరిస్థితి.

ఎదో ఒక దొంగ దారిలో బ్లాక్ మనీని తరలించడం ఇప్పటికే చూస్తూ ఉన్నాం కానీ పరిస్థితులు మునుపటిలాగా మారడానికి మాత్రం ఖచ్చితంగా చాలానే టైం పట్టేలా ఉంది. కోటాను కోట్లు పారితోషికం తీసుకునే హీరోల దగ్గర ఇప్పుడు డబ్బు బూజు పడుతోంది ఆ బ్లాక్ మనీ ని ఎలా వదిలించుకోవాలో తెలీక వారు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక హీరో తనకు పారితోషకంగా వచ్చిన 4కోట్ల రూపాయలను నిర్మాతకు తీరి పంపించేసాడని సమాచారం. పెద్ద ఫామిలీ కి చెందిన ఈ హీరోకి పరిశ్రమ లో చాలా పలుకుబడి ఉంది. పొలిటికల్ కనక్షన్స్ కూడా గట్టిగా ఉన్న ఆ హీరో ని ఏమీ చెయ్యలేని నిర్మాత సైలెంట్ అయిపోయాడు. ఆ డబ్బంతా దాదాపుగా బ్లాక్ మనీయే అని సమాచారం. ఇప్పుడా నోట్ల కట్టల్ని ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాడు ప్రొడ్యూసర్. ఆయన దగ్గర ఇంకా చాలా క్యాష్ ఉన్నట్లు సమాచారం. అయితే మరో పక్క ఈ డబ్బు అంతటినీ వైట్ చేసుకునే ప్లాన్ లో బిజీగా ఉన్నాడు సదరు నిర్మాత….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus