సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు

  • June 20, 2018 / 05:57 AM IST

సినిమాలను అద్భుతంగా తీయడమే కాదు.. సరైన సమయంలో రిలీజ్ చేస్తేనే మంచి కలక్షన్స్ సాధిస్తాయి. అందుకే స్టార్ హీరోలు సీజన్లో తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. ఈ ఏడాది దసరా, దీపావళి సీజన్స్ కి డేట్స్ ఖరారు చేసుకున్నారు. అలాగే తెలుగు హీరోలకు కాసులు కురిపించే సంక్రాంతి సీజన్ కి ఇప్పుడే బెర్త్ లు కన్ఫామ్ చేసుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు పోటీ పడనున్నాయని ఇప్పుడే ప్రకటించేశారు. ఇందులో ముందువరుసలో ఉంది ఎన్టీఆర్ బయోపిక్. బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాని జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం తెలుగువారందరూ ఎదురుచూస్తున్నారు.

ఇక సంక్రాంతి బరిలో వస్తున్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని పెద్ద పండుగకు తీసుకురావాలని నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ ఫిక్స్ అయ్యారు. భరత్ అనే నేను సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక బిగ్ ఫైట్ ఇవ్వడానికి వస్తున్న హీరో రామ్ చరణ్ తేజ్. రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన చెర్రీ… బోయపాటి శ్రీనుతో కల్సి భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాని జనవరి 12 న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత దానయ్య ప్రకటించాడు. ఈ మూడింటి మధ్య భారీ ఫైట్ తధ్యమని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus