గోవా బ్యూటీ ఇలియానా “దేవదాసు” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. వెంటనే “పోకిరి” లో సన్నని నడుము ఊపి హీరోల చూపు తన వైపు తిప్పుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టింది. మధ్యలో జల్సా, కిక్ సూపర్ హిట్ కాగా ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఇలియానా ఇంటి ముందు తెలుగు నిర్మాతలు క్యూ కట్టారు. అయినప్పటికీ ఆమెకు బాలీవుడ్ లో అవకాశం రాగానే తెలుగు చిత్రం ఒప్పుకోలేదు. అసలు దక్షిణాది సినిమాలనే వదిలేసింది. అక్కడ చేసిన చిత్రాల్లో బర్ఫీ, రుస్తుం ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గత ఏడాది నుంచి అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోవడంతో టాలీవుడ్ పై పడి ఏడుస్తోంది. తనని తెలుగు పరిశ్రమకు చెందిన వారు మరిచిపోయారని చెబుతోంది.
“ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాలే చేస్తున్నాను. దక్షిణాదిలో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. కారణం ఏమిటో తెలియడం లేదు. ఈ మధ్య ఒక తెలుగు దర్శకుడు వచ్చి కథ చెప్పారు. మా చిత్రంలో మీరే కథానాయకి అని అన్నారు. అంతే మళ్లీ కనబడలేదు. ఇప్పుడా చిత్రంలో వేరే నటి నటిస్తున్నారు. నన్నెందుకు తొలగించారని నేనా దర్శకుడిని అడగ్గా సారీ అని ఫోన్ పెట్టేశారు.” అని ఇలియానా వెల్లడించింది. “నాకు ఎవరితోనూ విభేదాలు లేవు.. డైరక్టర్ చెప్పినట్లే చేస్తుంటాను. అటువంటప్పుడు నన్ను ఎందుకు దూరం పెట్టారు. ఇక నుంచి అయినా నాకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను” అని తన మనసులోని మాటను బయట పెట్టింది. అప్పట్లో దక్షిణాదిని చిన్న చూపు చూడకుండా ఉంటే ఇప్పుడు ఇలియానాకి ఈ పరిస్థితి వచ్చేదా ? అని టాలీవుడ్ ప్రముఖులు చెప్పుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.