Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరోకరు ఏదో ఒక కారణంతో మరణిస్తూనే ఉన్నారు. టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ ఇలా మిగతా భాషల్లోని సినీ ప్రముఖులు కూడా మరణిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.

Arjuna Raju

వయసు మీద పడ్డ వారు మాత్రమే కాదు హార్ట్ స్ట్రోక్ తో మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు, అలాగే ప్రమాదవశాత్తు లేదంటే ఆత్మహత్యలు చేసుకుని చిన్న వయసు ఉన్న వాళ్ళు సైతం ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. టాలీవుడ్లో ఈ విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.టాలీవుడ్ సీనియర్ నిర్మాత ‘రోజా ఆర్ట్స్’ అధినేతల్లో ఒకరైన శ్రీ యం.అర్జున రాజు గారు ఈరోజు హఠాన్మరణం చెందారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ఇబ్బంది పడుతూ ఈరోజు ప్రాణాలు విడిచినట్టు తెలుస్తుంది. ‘రోజా ఆర్ట్స్’ బ్యానర్‌పై శివరామరాజుతో కలిసి ‘కొండవీటి సింహం’ ‘వేటగాడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు అర్జున రాజు గారు.

వాటితో పాటు సంచలన విజయాలను సాధించిన సినిమాలకి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తర్వాత బ్యానర్ పేర్లు ‘రోజా ప్రొడక్షన్స్’ ‘రోజా ఎంటర్ ప్రైజెస్’ వంటిని స్థాపించి.. వాటిపై కూడా పెద్ద సినిమాలు అందించారు. అలాంటి అగ్ర నిర్మాతని ఈరోజు ఇండస్ట్రీ కోల్పోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. ఇక అర్జున రాజు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకి కూడా ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని.. టాలీవుడ్ కి చెందిన కొందరు సినీ ప్రముఖులు కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus