ఉయ్యాలవాడ కథని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో?

  • September 24, 2019 / 04:57 PM IST

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబర్ 2 న విడుదల కాబోతుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 250 కోట్ల భారీ బడ్జెట్ తో రాంచరణ్ నిర్మించాడు. ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ‘సైరా’ టీం సభ్యులు. ఇక మొన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ’10 సంవత్సరాలు అంటే దశాబ్ద కాలం పై నుండీ ఈ కథని మోస్తున్నాం… చివరికి మెగాస్టార్ అయితేనే పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది’ అని పరిచూరి బ్రదర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతే ముందు ఈ కథని కొంతమంది హీరోలు రిజెక్ట్ చేసారు అని వారు ఇన్డైరెక్ట్ గా తెలిపారని స్పష్టమవుతుంది.

కర్నూల్ జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎంతో పౌరుషం కలిగిన వ్యక్తి. ఈయన జీవిత చరిత్ర లో కమర్షియల్ హంగులు చాలా ఉన్నాయి. అయితే ఇంత గొప్ప కథని రిజెక్ట్ చేసిన హీరో ఎవరా ? అని మీ డౌట్. ఇంకెవరెండీ మన నందమూరి అందగాడు బాలయ్వనే…! అవును ‘సమరసింహా రెడ్డి’ సినిమా టైంలోనే బాలయ్యకు ఈ కథ చెప్పారట. కానీ ఎందుకో ఆయన చేయలేదు. అంతేకాదు మొదట మెగాస్టార్ కూడా ఈ కథకి నో చెప్పారట. ఆ తరువాత ఆయన రీ ఎంట్రీ సమయంలో కూడా ఈ కథ వద్దనుకున్నారు. కానీ రాంచరణ్ ఇన్వాల్వ్ అయ్యి ఒప్పించాడని తెలుస్తుంది.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus