మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పిన టాలీవుడ్ స్టార్స్

Advertisement

మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ మూర్తికి టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపారు. తమ విజయానికి, ఆనందానికి కారణమైన మహిళామూర్తులను గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ తల్లి, భార్య, పిల్లలు, అక్కా చెల్లెళ్లను ఉద్దేశిస్తూ పోస్టులు చేశారు. వాటిలో కొన్ని..

మహేష్ బాబు“అందంగా ఉండాలి. ప్రేమతో ఉండాలి. గౌరవంతో ఉండాలి. గర్వంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఆశ్చర్యమే అయినా ఎప్పటికి నిలిచి ఉండే స్ఫూర్తిని నింపిన ప్రపంచంలోని మహిళల అందరికీ.. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”

ఎన్టీఆర్“మనతో ఉండే మహిళలను సంతోషంగా ఉంచడమే అసలైన ఆనందం. మహిళా దినోత్సవ స్ఫూర్తిని జరుపుకుంటున్న సందర్భంగా.. నా జీవితంలోని ఇద్దరు అతి ముఖ్యమైన మహిళలు వీరే” అంటూ తల్లి షాలిని .. భార్య ప్రణతి కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు.

నందమూరి కళ్యాణ్ రామ్“నా జీవితంలో అత్యంత విలువైన మహిళలతో స్త్రీ శక్తి స్ఫూర్తిని వేడుకగా జరుపుకుంటున్నా”

అక్కినేని నాగార్జున“ప్రియమైన అమలను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది. సమాజానికి స్వార్ధం లేని సేవలు చేసినందుకు గాను.. రాష్ట్రపతి చేతుల మీదుగా తాను నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది.”

సుశాంత్“అమల అత్తను చూస్తే మాకెంతో గర్వంగా ఉంటుంది. స్త్రీ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది”

సాయి ధరమ్ తేజ్“నా శక్తికి మూలం.. మహిళలను గౌరవించమని తను నాకు నేర్పింది. నేను నీ నీడను అయినందుకు లవ్ యూ అమ్మా. స్త్రీలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”

మంచు విష్ణు“ఇక్కడ కనిపిస్తున్న అందమైన.. శక్తివంతులైన.. అద్భుతమైన మహిళలకు హ్యాపీ ఉమెన్స్ డే”

సంపూర్ణేష్ బాబు“తను సంతోషంగా ఉంటే.. నువ్వు సంతోషంగా ఉన్నట్లే”

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news