మరో అగ్ర నిర్మాత కొడుకు డెబ్యూకి రంగం సిద్ధం

Advertisement

ఇప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ అనేది ఎంత ముఖ్యమో.. ఆ టాలెంట్ తెరపైకెక్కి.. ప్రేక్షకుల దాకా రావాలంటే కాంటాక్ట్స్, అదృష్టం & సపోర్ట్ కూడా అంతే కీలకం. ప్రస్తుతం ఇండస్ట్రీలో వారసులు రాణించడం తక్కువైంది. కానీ.. వారి ఎంట్రీలు మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ ప్రేమకథతో గణేష్ 2020లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇప్పుడు ఈ జాబితాలో చేరేందుకు మరో నిర్మాత కొడుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం “ఆర్.ఆర్.ఆర్” అనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తూ ఫుల్ జోష్ లో ఉన్న డి.వి.వి.దానయ్య అదే ఊపులో తన కుమారుడ్ని హీరోగా లాంచ్ చేసే పనిలో పడ్డాడు. “ప్రతిరోజూ పండగ” పనులన్నీ పూర్తైపోయి ప్రస్తుతం నెక్స్ట్ ప్రొజెక్ట్ కోసం రెడీగా ఉన్న మారుతికి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆశజూపి తన కుమారుడ్ని హీరోగా లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడట దానయ్య. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుంది.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus