తెలుగు చిత్ర పరిశ్రమ హీరోల్లో మార్పు

  • December 24, 2016 / 09:44 AM IST

టాలీవుడ్ సినిమాలు తన రూపుని మార్చుకుంటున్నాయి. కొంతకాలం క్రితం వరకు హీరో కోసం కథలో చేంజెస్  చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారుతోంది. ఈ ఏడాది పెళ్ళిచూపులు, బిచ్చగాడు, క్షణం వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ హీరోల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కథ ప్రకారమే నడుచుకునేందు స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. అందుకే కథనే హీరోగా చేసి హిట్లు అందుకుంటున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి దర్శకులకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. త్రివిక్రమ్ అ..ఆ మూవీలో నితిన్ కి పెద్ద హీరోయిజం ఉండదు. జనతా గ్యారేజ్ లోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కథకు సంబంధించిన సీన్లు మాత్రమే ఉంటాయి.

రేంజ్, ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన తీయలేదు. మొదట్లో దీనికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ చివరి టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. సో చివరికి కథే ముఖ్యమని అందరూ అర్ధం చేసుకున్నారు. స్టార్స్ నటించిన బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు ఆడియన్స్ తిప్పికొట్టడంతో వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ఇలా 2016 ఇచ్చిన అనుభవంతో తెలుగు హీరోలు కొత్త రూట్లో, కొత్త కథలతో 2017 కి ముస్తాబు అవుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus